Breaking News

వైభవ్‌పై ఫార్ములా-1 స్టార్‌ రేసర్‌ ప్రశంసలు

Published on Sat, 07/18/2026 - 13:09

భారత క్రికెట్‌ యువ కెరటం  వైభవ్ సూర్యవంశీపై ఫార్ములా-1 సంచలనం, రేసింగ్ బుల్స్ డ్రైవర్ అర్విడ్ లిండ్బ్లాడ్ (Arvid Lindblad) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రీడల్లో చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లలో వైభవ్ కూడా ఒకడని కొనియాడాడు.

ఇటీవల ఇంగ్లండ్-భారత్ తొలి వన్డే సందర్భంగా స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన లిండ్బ్లాడ్.. సాంకేతికత అభివృద్ధి, చిన్న వయసులోనే మెరుగైన సమాచారం అందుబాటులోకి రావడం వల్ల యువ ఆటగాళ్లు అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని చెప్పాడు.

"ఇది అన్ని క్రీడల్లో కనిపిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. చిన్న వయసులోనే సరైన సమాచారం, శిక్షణ లభిస్తోంది. అందుకే చాలా చిన్న వయసులోనే ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ, ఫుట్‌బాల్‌లో లమీన్ యమాల్ అందుకు మంచి ఉదాహరణలు. 

వైభవ్ చాలా చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు ప్రపంచ క్రీడల స్వభావంగా మారింది" అని లిండ్బ్లాడ్ వ్యాఖ్యానించాడు.

ఇదే సందర్భంగా తన భారతీయ మూలాల గురించి కూడా అతడు మాట్లాడాడు. తన అమ్మమ్మ, తాతయ్య పంజాబ్‌కు చెందిన వారని, భారతీయ సంస్కృతితో తనకు బలమైన అనుబంధం ఉందని తెలిపాడు. 

గతేడాది ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన అనుభవం ఎంతో ప్రత్యేకమని గుర్తు చేసుకున్నాడు. అలాగే తన అమ్మమ్మ వండే భారతీయ వంటకాలు తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.

ఫార్ములా-1లో అడుగుపెట్టడం తన చిన్ననాటి కల అని, ఈ ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్‌లో అరంగేట్రం చేసిన సమయంలో భావోద్వేగానికి గురయ్యానని లిండ్బ్లాడ్ వెల్లడించాడు. చిన్నప్పుడు తండ్రితో కలిసి తొలిసారి వెళ్లిన సిల్వర్‌స్టోన్ ట్రాక్‌లోనే ఎఫ్1 డ్రైవర్‌గా రేస్ చేయడం జీవితంలో మరపురాని క్షణమని పేర్కొన్నాడు.

అలాగే బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కలవడం ఆనందంగా అనిపించిందని చెప్పిన లిండ్బ్లాడ్, ఫార్ములా-1 కార్లు నడిపినా ఇప్పటికీ రోడ్డు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తీసుకోలేదని సరదాగా వ్యాఖ్యానించాడు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)