Breaking News

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డు

Published on Sat, 08/09/2025 - 13:15

జింబాబ్వే పర్యటనలో ఉన్న న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు పసికూనకు చుక్కలు చూపిస్తోంది. తొలి టెస్టులో ఆతిథ్య జింబాబ్వే (ZIM vs NZ)ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్‌ టీమ్‌.. రెండో టెస్టులోనూ అదరగొడుతోంది. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి ఏకంగా 476 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

125 పరుగులకే ఆలౌట్‌
కాగా బులవాయో వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్‌ చేసింది. కివీస్‌ బౌలర్లు ఆకాశమే హద్దుగా విజృంభించడంతో 125 పరుగులకే కుప్పకూలింది. 

జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్‌ బ్రెండన్‌ టేలర్‌ (44), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ టఫాజ్వ త్సింగా (33 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగిలిన వారిలో నిక్‌ వెల్చ్‌ (11), సీన్‌ విలియమ్స్‌ (11) మాత్రమే పది పరుగుల స్కోరు దాటాడు.

కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగగా.. జకారీ ఫౌల్క్స్‌ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మాథ్యూ ఫిషర్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

కాన్వే, రచిన్‌, నికోల్స్‌ భారీ శతకాలు
ఓపెనర్లలో డెవాన్‌ కాన్వే (245 బంతుల్లో 153) శతక్కొట్టగా.. విల్‌ యంగ్‌ (Will Young) హాఫ్‌ సెంచరీ (74)తో రాణించాడు. నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన బౌలర్‌ జేకబ్‌ డఫీ మాత్రం 36 పరుగులే చేయగలిగాడు. అయితే, హెన్రీ నికోల్స్‌, రచిన్‌ రవీంద్ర కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

రచిన్‌ కేవలం 139 బంతుల్లోనే 165 పరుగులతో అజేయంగా ఉండగా.. నికోల్స్‌ 245 బంతుల్లో 150 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 130 ఓవర్లలో న్యూజిలాండ్‌ కేవలం​ మూడు వికెట్ల నష్టానికి 601 పరుగుల భారీ స్కోరు సాధించింది. జింబాబ్వే కంటే తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ప్రపంచంలోనే తొలి జట్టుగా
కాన్వే, నికోల్స్‌, రచిన్‌ల భారీ సెంచరీల కారణంగానే ఇది సాధ్యమైంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. విదేశీ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు 150కి పైగా వ్యక్తిగత స్కోర్లు సాధించడం ఇదే తొలిసారి. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా కివీస్‌ అవతరించింది.

ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో ఇంగ్లండ్‌ (1938లో ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియా మీద మూడు 150+ స్కోర్లు), టీమిండియా (శ్రీలంక మీద కాన్పూర్‌లో మూడు 150+ స్కోర్లు) న్యూజిలాండ్‌ కంటే ముందు వరుసలో ఉన్నాయి. 

చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన షాహిన్‌ ఆఫ్రిది

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)