Breaking News

'హార్దిక్‌, రాహుల్ కాదు.. రోహిత్ శ‌ర్మ త‌ర్వాత అత‌డే టీమిండియా కెప్టెన్‌'

Published on Tue, 08/06/2024 - 08:24

టీమిండియా యువ ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్‌పై భార‌త మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్  ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. రోహిత్ శర్మ త‌ర్వాత మూడు ఫార్మాట్ల‌లోనూ భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా గిల్ బాధ్య‌త‌లు చేప‌డ‌తాడ‌ని శ్రీధర్ జోస్యం చెప్పాడు. కాగా గిల్ ప్ర‌స్తుతం శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త జ‌ట్టు వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

ఈ లంక టూర్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్‌గా స్టార్ ఆట‌గాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ను కాద‌ని మ‌రి గిల్‌ను బీసీసీఐ నియ‌మించింది. అంత‌కుముందు జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌తో కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన గిల్‌.. త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో అంద‌ర‌ని ఆక‌ట్టుకున్నాడు. 

జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో భార‌త్ సొంతం చేసుకుంది. టెస్టుల్లో కూడా రోహిత్ డిప్యూటీగా గిల్‌ను నియ‌మించాల‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

"యశ‌స్వీ జైశ్వాల్‌, శుబ్‌మ‌న్ గిల్ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో  ఉన్నారు. అంత‌కుముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కూడా వీరిద్ద‌రూ అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. వ‌న్డేల్లో కూడా అద‌ర‌గొడుతున్నారు. ముఖ్యంగా శుబ్‌మ‌న్ గిల్ ఎంత చెప్పుకున్న త‌క్కువే. 

అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయ‌ర్‌. అత‌డు ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ వ‌ద్ద‌ కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. గిల్‌లో కూడా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. జింబాబ్వే టూర్‌లో కెప్టెన్‌గా గిల్ విజ‌య‌వంత‌మ‌య్యాడు. 2027 వ‌న్డే ప్ర‌పంచకప్‌ తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా గిల్‌ ఎంపికవుతాడని" శ్రీధర్ పేర్కొన్నాడు.
చదవండి: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024పై నీలినీడ‌లు! భారత్‌ వేదికగా?

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు