ఇంత చెత్తగా బౌలింగ్‌ చేస్తారా?.. హర్షిత్‌ రాణాపై అశ్విన్‌ ఫైర్‌

Published on Sat, 09/27/2025 - 16:58

టీమిండియా యువ బౌలర్‌ హర్షిత్‌ రాణా (Harshit Rana) ఆట తీరును భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (R Ashwin) విమర్శించాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో అతడి టెక్నిక్‌ సరిగ్గా లేదని.. తప్పులు సరిచేసుకోవాలని సూచించాడు. తన బౌలింగ్‌లో ప్రత్యర్థులు చితక్కొడుతున్నా మూస పద్ధతిలో వెళ్లడం సరికాదంటూ మండిపడ్డాడు.

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌ ఆడే భారత జట్టులో పేస్‌ బౌలర్ల కోటాలో.. జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh)తో పాటు హర్షిత్‌ రాణా స్థానం దక్కించుకున్నాడు. అయితే, ఈ టీ20 టోర్నీలో ఇప్పటికి టీమిండియా ఆడిన  ఆరు మ్యాచ్‌లలో.. అతడి​కి కేవలం రెండు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది.

 26 పరుగులు
తొలుత లీగ్‌ దశలో భాగంగా ఆఖరిగా ఒమన్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో హర్షిత్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో 13 పరుగులతో అజేయంగా నిలిచిన హర్షిత్‌.. బౌలింగ్‌ పరంగానూ ఫర్వాలేదనిపించాడు. నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.

ఎక్స్‌పెన్సివ్‌ బౌలింగ్‌
అయితే, తాజాగా.. శుక్రవారం రాత్రి శ్రీలంకతో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో మాత్రం హర్షిత్‌ తేలిపోయాడు. అతడి బౌలింగ్‌లో లంక ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక చితక్కొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ రైటార్మ్‌ పేసర్‌ ఏకంగా 54 పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్‌ తీశాడు.

ఈ నేపథ్యంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందిస్తూ.. ‘‘హర్షిత్‌ రాణా గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. అవును.. అతడికి కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. వేరే వారి కోసం అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది.

ఇంత చెత్తగా బౌలింగ్‌ చేస్తారా?
ఇలా జట్టులోకి వస్తూ పోతూ ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. లయ కూడా మారుతుంది. అయితే, ఈ మ్యాచ్‌లో.. ఒకటి వేగంగా.. మరొకటి నెమ్మదిగా.. ఇంకోటి వేగంగా.. మరొకటి నెమ్మదిగా.. ఇలా పరిణతి లేకుండా సాగిపోయింది అతడి బౌలింగ్‌.

ఈ తప్పుల నుంచి అతడు కచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది’’ అని అశూ సుతిమెత్తగానే చురకలు అంటించాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం మరింతగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించాడు. 

కాగా శ్రీలంకతో నామమాత్రపు సూపర్‌-4 మ్యాచ్‌ టై కాగా.. సూపర్‌ ఓవర్లో గెలిచిన టీమిండియా అజేయంగా ఫైనల్‌లో ఆడనుంది. దుబాయ్‌లో  దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా టైటిల్‌ కోసం ఆదివారం తలపడుతుంది.

చదవండి: IND vs WI: ‘అతడి తండ్రి గట్టిగానే నిలదీశాడు.. అందుకే ఆ ప్లేయర్‌పై వేటు’

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)