Breaking News

ఇరాన్‌ దాడులు.. దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు

Published on Sun, 03/01/2026 - 16:15

భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రస్తుతం దుబాయ్‌లో చిక్కుకుపోయింది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడులు కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె ప్రయాణానికి అంతరాయం కలిగింది. సింధు బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్ కోసం దుబాయ్‌ మీదుగా లండన్‌కు బయల్దేరింది.

దుబాయ్ ట్రాన్సిట్‌లో ఉన్న సమయంలో గల్ఫ్ ఎయిర్‌స్పేస్‌లో మిసైల్ దాడుల కారణంగా అన్ని విమాన సర్వీసులు నిలిపి వేయబడ్డాయి. దీంతో సింధు విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులపై సింధు తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది. 

తాము ఉన్న ప్రాంతానికి అతి సమీపంలో ఓ భారీ పేలుడు సంభవించింది. ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశాము. ఇక్కడి పరిస్థితులు క్రమేపీ భయానకంగా మారుతున్నాయి. ‍ప్రస్తుతానికి తామంతా క్షేమంగా ఉన్నాము. 

ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తమను సురక్షిత ప్రాంతానికి తరలించారు అని ఎక్స్‌లో పేర్కొంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ.. ప్రయాణికులు అనిశ్చితిలో వేచి ఉన్న దృశ్యాలను చూపించింది.

కాగా, అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అల్‌  ఖమేనీ మృతి చెందగా, పలువురు భద్రతా అధికారులు ప్రాణాలు కోల్పోయారు.

ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మరియు మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై మిసైల్ మరియు డ్రోన్ దాడులు చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు పామ్ జుమైరా ప్రాంతాలు ఇరాన్ మిసైల్ దాడులకు గురయ్యాయి. బుర్జ్ ఖలీఫా సమీపంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల కారణంగా గల్ఫ్ ఎయిర్‌స్పేస్ మూసివేయబడింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)