Breaking News

సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు

Published on Tue, 03/03/2026 - 14:31

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్దం కారణంగా దుబాయ్‌లో ఇరుక్కుపోయిన ఆమె.. ఇవాళ ఉదయం సురక్షితంగా బెంగళూరులో ల్యాండయ్యింది. వాస్తవానికి సింధు ఆల్‌ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్‌కు వెళ్లాల్సి ఉండింది. అయితే అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్దం కారణంగా గమ్యానికి చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టింది.

భయానక అనుభవం  
సింధు బర్మింగ్‌హామ్‌కు ప్రయాణం చేస్తూ దుబాయ్‌లో ట్రాన్సిట్‌లో ఉండగా, గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయారు. ఆ సమయంలో సింధు ఉన్న ప్రాంతం దగ్గరలో పేలుడు సంభవించడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఆమె కోచ్ పేలుడు ధాటికి గురయ్యాడు.

ఇంటికి చేరాను  
మార్చి 3న సింధు “సురక్షితంగా ఇంటికి చేరాను” అని Xలో పోస్ట్ చేసింది. “ఈ క్లిష్ట సమయంలో సహకరించిన గ్రౌండ్ టీమ్స్, దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని, తదుపరి అడుగులు ఆలోచిస్తానని పేర్కొంది.  

కాగా, సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌ కోసం కఠోరంగా శ్రమించింది. ఈ సారి ఎలాగైనా టైటిల్‌ నెగ్గాలన్న కసితో ఉండిన ఆమెకు అనుకోని అవరోధాలు ఎదురయ్యాయి. దుబాయ్‌లో చిక్కుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల కోసం అన్వేశించినా, భద్రతా కారణాల వల్ల సాధ్యం కాలేదు.  ఈ టోర్నీ నుంచి సింధులాగే మరికొందరు క్రీడాకారులు కూడా వైదొలిగినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఇవాల్టి నుంచి మార్చి 8 వరకు జరగాల్సి ఉండింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)