Breaking News

పంజాబ్‌ను ఇలా చూస్తుంటే నా గుండె త‌రుక్కుపోతోంది: శుబ్‌మన్‌ గిల్‌

Published on Tue, 09/02/2025 - 14:59

ఉత్తరాది రాష్ట్రం పంజాబ్‌ను భారీ వ‌ర‌దులు ముంచెత్తున్నాయి. గ‌త కొన్ని రోజుల నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 29 మంది మ‌ర‌ణించారు. సుమారు వెయ్యి గ్రామాలు వాన‌నీటిలో మునిగిపోయాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల  2.65 లక్షలకు పైగా నివాసితులు ప్రభావితమయ్యారు. 

అంతేకాకుండా పంట‌లు కూడా భారీగా దెబ్బ‌తిన్నాయి. ఈ వ‌ర‌ద‌లు వ‌ల్ల‌ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, కపుర్తలా, తరన్ తరణ్, ఫిరోజ్‌పూర్, హోషియార్‌పూర్  అమృత్‌సర్‌తో సహా 12 జిల్లాలు అత‌ల‌కుత‌ల‌మ‌య్యాయి. 

ఆగస్టు నెలలో రాష్ట్రంలో 250 మి.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. గ‌త 25 సంవత్సరాలలో ఇదే అత్యధికం కావ‌డం గ‌మ‌నార్హం. సట్లెజ్, బియాస్, రావి వంటి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ తీవ్ర‌మైన విఫ‌త్తుపై పంజాబ్ లోక‌ల్ బాయ్‌, టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ స్పందించాడు.

"వరదలతో అతలాకుత‌లం  నా పంజాబ్ చూస్తుంటే నా హృదయం తరుక్కుపోతుంది.  పంజాబ్ ఎన్ని కష్టాల్లు వచ్చినా ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. మేము ఈ స్థితి నుంచి మళ్లీ పైకి వస్తాం. బాధిత కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నాను. 

ప్రజలకు నా పూర్తి మద్దతు ఉంటుంది" అని గిల్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా శుబ్‌మన్ ఆసియాకప్ కప్‌-2025 కోసం సిద్దమవుతున్నాడు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ టీ20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఖండాంతర టోర్నీలో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా గిల్ వ్యవహరించనున్నాడు.
చదవండి: ‘ది హండ్రెడ్‌’లో ఇరగదీశారు.. ఆ నలుగరికి ఐపీఎల్‌లో భారీ ధర!

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)