చెన్నై ఖేల్‌ ఖతం

Published on Thu, 05/01/2025 - 02:46

సొంతగడ్డపై వరుసగా ఐదో మ్యాచ్‌లో పరాజయంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కథ ముగిసింది. పేలవ ప్రదర్శనతో ఎనిమిదో ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న ఐదుసార్లు చాంపియన్‌ మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌ రేసుకు దూరమైంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో పంజాబ్‌ కింగ్స్‌ కీలక విజయాన్ని నమోదు చేసింది. ముందుగా చహల్‌ ‘హ్యాట్రిక్‌’...బ్యాటింగ్‌లో శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్‌ కలిసి జట్టును గెలిపించారు.  

చెన్నై: ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోరులో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. స్యామ్‌ కరన్‌ (47 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా, బ్రెవిస్‌ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. 

యుజువేంద్ర చహల్‌ (4/32) ఒకే ఓవర్లో ‘హ్యాట్రిక్‌’ సహా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్‌ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు.  

ఒకే ఓవర్లో 26 పరుగులు... 
చెన్నైకి ఓపెనర్లు సరైన ఆరంభం ఇవ్వలేకపోయారు. ఆంధ్ర ఆటగాడు షేక్‌ రషీద్‌ (11) తనకు లభించిన మరో అరుదైన అవకాశాన్ని వృథా చేసుకోగా, ఆయుశ్‌ మాత్రే (7) విఫలమయ్యాడు. హర్‌ప్రీత్‌ ఓవర్లో జడేజా (17) మూడు ఫోర్లు కొట్టినా అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో కరన్, బ్రెవిస్‌ భాగస్వామ్యంలో జట్టు నిలదొక్కుకుంది. కరన్‌ చెలరేగిపోగా, బ్రెవిస్‌ కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 78 పరుగులు జోడించారు. 

15 ఓవర్లలో జట్టు స్కోరు 134/4. సూర్యాంశ్‌ షెడ్గే వేసిన తర్వాతి ఓవర్లో కరన్‌ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో కరన్‌ వరుసగా 6, 6, 2 (నోబాల్‌), 2, 4, 4, 1 బాదడంతో మొత్తం 26 పరుగులు రావడం విశేషం. ఈ జోరులో కరన్‌ సెంచరీ, సీఎస్‌కే 200 దాటడం ఖాయంగా అనిపించాయి. అయితే చివరకు ఈ రెండూ జరగలేదు. యాన్సెన్‌ బౌలింగ్‌లో కరన్‌ అవుట్‌ కాగా...చహల్‌ వేసిన 19వ ఓవర్‌తో అంతా మారిపోయింది. 11 బంతుల వ్యవధిలో చెన్నై 6 వికెట్లు కోల్పోయింది.  

కీలక భాగస్వామ్యాలు... 
పంజాబ్‌ ఇన్నింగ్స్‌ మెరుగ్గా మొదలైంది. ప్రియాన్ష్ ఆర్య (15 బంతుల్లో 23; 5 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్‌ చక్కటి షాట్లతో 28 బంతుల్లో 44 పరుగులు జోడించారు. తొలి 6 ఓవర్లలో స్కోరు 51 పరుగులకు చేరింది. ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్‌ రెండో వికెట్‌కు 50 బంతుల్లో 72 పరుగులు జత చేశారు. నూర్‌ ఈ జోడీని విడదీయగా, వధేరా (5) విఫలమయ్యాడు. మరోవైపు కరన్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో శ్రేయస్‌ 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ప్రభ్‌సిమ్రన్‌ వెనుదిరిగినా...శశాంక్‌ (23; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి శ్రేయస్‌ జట్టును గెలుపు దిశగా నడిపించాడు.  

స్కోరు వివరాలు  
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రషీద్‌ (సి) శశాంక్‌ (బి) అర్ష్ దీప్  11; ఆయుశ్‌ (సి) శ్రేయస్‌ (బి) యాన్సెన్‌ 7; స్యామ్‌ కరన్‌ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) యాన్సెన్‌ 88; జడేజా (సి) ఇన్‌గ్లిస్‌ (బి) హర్‌ప్రీత్‌ 17; బ్రెవిస్‌ (బి) అజ్మతుల్లా 32; శివమ్‌ దూబే (సి) శశాంక్‌ (బి) అర్ష్ దీప్  6; ధోని (సి) వధేరా (బి) చహల్‌ 11; హుడా (సి) ఆర్య (బి) చహల్‌ 2; కంబోజ్‌ (బి) చహల్‌ 0; నూర్‌ (సి) యాన్సెన్‌ (బి) చహల్‌ 0; ఖలీల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 190.  వికెట్ల పతనం: 1–21, 2–22, 3–48, 4–126, 5–172, 6–184, 7–186, 8–186, 9–186, 10–190. బౌలింగ్‌: అర్ష్ దీప్  3.2–0–25–2, యాన్సెన్‌ 4–0– 30–2, అజ్మతుల్లా 4–0–39–1, హర్‌ప్రీత్‌ 2–0– 21–1, చహల్‌ 3–0–32–4, సూర్యాంశ్‌ 3–0– 40–0.  

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) ధోని (బి) అహ్మద్‌ 23; ప్రభ్‌సిమ్రన్‌ (సి) బ్రెవిస్‌ (బి) నూర్‌ 54; శ్రేయస్‌ (బి) పతిరణ 72; వధేరా (సి) జడేజా (బి) పతిరణ 5; శశాంక్‌ (సి) బ్రెవిస్‌ (బి) జడేజా 23; ఇన్‌గ్లిస్‌ (నాటౌట్‌) 6; సూర్యాంశ్‌ (సి) నూర్‌ (బి) అహ్మద్‌ 1; యాన్సెన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–44, 2–116, 3–136, 4–180, 5–188, 6–190. బౌలింగ్‌: ఖలీల్‌ 3.4–0–28–2, కంబోజ్‌ 2–0–20–0, జడేజా 3–0–32–1, నూర్‌ 4–0–39–1, స్యామ్‌ కరన్‌ 3–0–27–0, పతిరణ 4–0–45–2.  

చహల్‌ ‘హ్యాట్రిక్‌’ 
యుజువేంద్ర చహల్‌ తన తొలి 2 ఓవర్లలో 23 పరుగులిచ్చాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ వేసే అవకాశం దక్కింది. వైడ్‌తో ఓవర్‌ మొదలు పెట్టగా తొలి బంతిని ధోని (11) సిక్సర్‌గా మలిచాడు. అయితే తర్వాతి బంతికే ధోని వెనుదిరగ్గా, మూడో బంతికి హుడా 2 పరుగులు తీశాడు. ఓవర్‌ చివరి మూడు బంతుల్లో  వరుసగా హుడా (2), కంబోజ్‌ (0), నూర్‌ (0)లను చహల్‌ అవుట్‌ చేశాడు. 

‘హ్యాట్రిక్‌’ పూర్తి కాగానే తనపై ఎన్నో మీమ్‌లకు కారణమైన ట్రేడ్‌ మార్క్‌ పొజిషన్‌లో కూర్చొని అతను సంబరాలు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో చహల్‌ ‘హ్యాట్రిక్‌’ తీయడం ఇది రెండోసారి. 2022 సీజన్‌లో రాజస్తాన్‌ తరఫున ఆడుతూ కోల్‌కతాపై అతను హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఒకటికంటే ఎక్కువసార్లు హ్యాట్రిక్‌ తీసిన మూడో ఆటగాడిగా అతను నిలిచాడు. గతంలో అమిత్‌ మిశ్రా 3 సార్లు, యువరాజ్‌ 2 సార్లు హ్యాట్రిక్‌ సాధించారు.  

ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్‌  X  ముంబై  
వేదిక: జైపూర్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)