Breaking News

టీమిండియాకు దూరం.. పుజారా కీలక నిర్ణయం, సూర్య కూడా

Published on Sat, 06/24/2023 - 08:54

టీమిండియా నయావాల్‌గా పేరుగాంచిన చతేశ్వర్‌ పూజారాకు షాక్ త‌గిలిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న  పుజారాను విండీస్‌తో టెస్టు సిరీస్‌కు పక్కనబెట్టారు.  ఇది పుజారా కెరీర్‌కు ఎండ్‌లా కనిపిస్తుందని సోషల్‌ మీడియాలో హోరెత్తుతున్నప్పటికి తాను మాత్రం పట్టించుకోలేదు. మళ్లీ ఎలాగైనా జట్టులోకి తిరిగి రావాలని ప్రయత్నంలో పూజ‌రా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు.

త‌న‌పై వేటు వేయ‌డంతో అసంతృప్తికి గురైన అత‌ను దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఓకే చెప్పాడు. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో స‌త్తా చాటాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. ఈ టోర్నీలో అత‌ను వెస్ట్ జోన్ జట్టు త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. పూజ‌రాతో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్‌ కూడా అదే జ‌ట్టులో ఆడేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆరు జ‌ట్లు పాల్గొంటున్న దులీప్ ట్రోఫీ బెంగ‌ళూరు వేదిక‌గా జూన్ 28న మొద‌ల‌వ్వ‌నుంది. విండీస్‌తో టెస్టుల‌కు ఎంపిక్వ‌ని సూర్య‌.. వ‌న్డే జ‌ట్టుతో మాత్రం క‌ల‌వ‌నున్నాడు.

కౌంటీల్లో రాణించి…
ఆస్ట్రేలియాతో జ‌రిగిన డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో పూజారా తీవ్రంగా నిరాశ ప‌రిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో త‌క్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. అంత‌కు ముందు ఇంగ్లండ్ గ‌డ్డ‌పై కౌంటీల్లో అద్భుతంగా రాణించి సెంచరీల మీద సెంచరీలు సాధించాడు. ఏ ఇంగ్లండ్‌లో అయితే చెలరేగాడో అదే గడ్డపై డబ్ల్యూటీసీ ఫైన‌ల్లో మాత్రం చేతులెత్తేశాడు.  

ఇప్పటివరకు  పుజారా 103 టెస్టుల్లో 43.60 సగటు, 19 సెంచరీలతో పుజారా 7195 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్టు సిరీస్‌ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించడం అతని కెరీర్‌లో అత్యుత్తమ క్షణాలు. ఇక వెస్టిండీస్ టూర్‌కు టెస్టు, వ‌న్డేల‌కు 16 మందితో కూడిన బృందాన్ని ఈరోజు క‌మిటీ ప్ర‌క‌టించింది. భార‌త జ‌ట్టు విండీస్ గ‌డ్డ‌పై 2 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టి20 ఆడ‌నుంది.

చదవండి: #CheteshwarPujara: కెరీర్‌ ముగిసినట్లే! ..'కొత్త గోడ'కు సమయం ఆసన్నం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)