చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌.. టీ20ల్లో ప్రపంచ రికార్డు

Published on Wed, 02/21/2024 - 16:25

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్‌ (పెషావర్‌ జల్మీ)  ఈ రికార్డును సాధించాడు. బాబర్‌కు ముందు ఈ రికార్డు యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉండేది.

గేల్‌ ఈ మార్కును తాకేందుకు 285 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. బాబర్‌ కేవలం 271 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్‌, గేల్‌ తర్వాతి స్థానాల్లో విరాట్‌ కోహ్లి (299 మ్యాచ్‌లు), డేవిడ్‌ వార్నర్‌ (303), ఆరోన్‌ ఫించ్‌ (327) ఉన్నారు. ఓవరాల్‌గా టీ20ల్లో 10000 పరుగుల మార్కును ఇప్పటివరకు 12 మంది (బాబర్‌ సహా) క్రాస్‌ చేశారు. పాక్‌ తరఫున షోయబ్‌ మాలిక్‌, బాబర్‌ ఆజమ్‌ ఈ ఘనతను సాధించారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద 10,000 పరుగుల మార్కును తాకిన బాబర్‌ 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. పెషావర్‌ ఇన్నింగ్స్‌లో బాబరే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌.. బాబర్‌ ఒక్కడే రాణించడంతో 154 పరుగులకు ఆలౌటైంది.

బాబర్‌తో పాటు రోవ్‌మన్‌ పావెల్‌ (39), ఆసిఫ్‌ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పెషావర్‌ ఇన్నింగ్స్‌లో ముగ్గురు (సైమ్‌ అయూబ్‌, జీషన్‌, సలాంకీల్‌) డకౌట్లయ్యారు. కరాచీ బౌలర్లలో మీర్‌ హమ్జా, హసన్‌ అలీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్‌ సామ్స్‌ 2, షోయబ్‌ మాలిక్‌, మొహమ్మద్‌ నవాజ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.  
 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)