ఉగ్రరూపం దాల్చిన పృథ్వీ షా.. సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ

Published on Mon, 10/27/2025 - 13:46

వివాదాస్పద బ్యాటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన రెండో రంజీ మ్యాచ్‌లోనే ఉగ్రరూపం దాల్చాడు. 2025-26 ఎడిషన్‌లో (Ranji Trophy) భాగంగా చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్‌) కేవలం 141 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.

ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 156 బంతులు ఎదుర్కొన్న షా.. 29 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 222 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డబుల్‌ సెంచరీ చేసే క్రమంలో షా కేవలం 72 బంతుల్లోనే శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. మొత్తంగా షాకు ఇది ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 14వ సెంచరీ.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకుని డబుల్‌ సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్‌ తొలి మ్యాచ్‌) డకౌట్‌తో ప్రారంభించిన షా (కేరళపై).. ఆ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 75 పరుగులతో రాణించాడు.

ప్రస్తుత రంజీ సీజన్‌ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్‌ఘడ్‌పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర  313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్‌ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్‌ బిష్ణోయ్‌ (54), పదో నంబర్‌ ఆటగాడు నిషంక్‌ బిర్లా (56 నాటౌట్‌) చండీఘడ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు.

104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మహారాష్ట్ర.. 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఫలితంగా 463 పరుగుల భారీ ఆధిక్యం సాధించి, ప్రత్యర్దికి 464 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

చదవండి: పక్కటెముకల్లో రక్తస్రావం.. సీరియస్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ఆరోగ్య పరిస్థితి

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)