Breaking News

పృథ్వీ షా ఆడబోయేది ఈ జట్టుకే!.. సీఎస్‌కే స్టార్‌ సారథ్యంలో..

Published on Tue, 06/24/2025 - 15:33

భారత క్రికెటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) తన సొంత జట్టు మంబైని వీడాడు. దేశవాళీ క్రికెట్‌లో జట్టు మారాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) అందుకు అంగీకరించింది. అతడు కోరినట్లుగానే నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేసింది.

పరస్పరం హుందా ప్రకటనలు
‘‘ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ నాకు విలువైన అవకాశాలెన్నో ఇచ్చింది. ఎల్లవేళలా నాకు మద్దతుగా నిలిచింది. అందుకు అసోసియేషన్‌కు ధన్యవాదాలు. ఎంసీఏకు చెందిన జట్టులో భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం.

ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నాను. అయితే, జట్టు మారాలని నిర్ణయించుకున్నాను’’ అని పృథ్వీ షా ఎంసీఏకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన ఎంసీఏ.. ‘‘క్రికెటర్‌ పృథ్వీ షా.. ముంబైకి చెందిన ఈ ప్రొఫెషనల్‌ ఆటగాడు వచ్చే దేశవాళీ సీజన్‌లో ఇతర జట్టుకు ఆడేందుకు అనుమతించాలని నిరభ్యంతర పత్రం కోరాడు.

అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఎంసీఏ ఎన్‌ఓసీ జారీ చేసింది’’ అని తమ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పృథ్వీ జట్టు ఆడబోయే కొత్త జట్టు ఇదేనంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా పృథ్వీ ఇకపై మహారాష్ట్ర జట్టుకు ఆడబోతున్నట్లు తెలిపింది.

మహారాష్ట్రకు ఆడేందుకే నిర్ణయం!
కాగా 25 ఏళ్ల పృథ్వీ షాకు రెండు- మూడు అసోసియేషన్ల నుంచి పిలుపు వచ్చినప్పటికీ.. మహారాష్ట్రకు ఆడేందుకే అతడు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. టీమిండియా ఓపెనర్లలో ఒకడైన రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్సీలో పృథ్వీ షా ఆడతాడు. కాగా మహారాష్ట్ర దేశీ జట్టును ముందుండి నడిపిస్తున్న రుతు.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా ఉన్న విషయం తెలిసిందే.

కాగా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి.. భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్‌ అందించిన పృథ్వీ షా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2020లో వన్డే, 2021లో టీ20లలోనూ అరంగేట్రం చేశాడు.

ఓపెనర్‌గా ఆరంభంలో ఆకట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత పృథ్వీ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్‌ లేమి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇవే కారణాలతో ఎంసీఏ కూడా అతడిని కొన్నాళ్లు పక్కనపెట్టింది.

ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు మొత్తంగా ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడిన పృథ్వీ షా.. ఆయా ఫార్మాట్లలో 339, 189, ఒక పరుగు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 79 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు సాధించాడు. అయితే, ఐపీఎల్‌-2025 మెగా వేలంలో అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.

చదవండి: IND vs ENG: రిషబ్‌ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)