Breaking News

‘మన అమ్మాయిలు అందరికీ స్ఫూర్తి’

Published on Fri, 11/07/2025 - 03:10

న్యూఢిల్లీ: దేశంలోని వేర్వేరు ప్రాంతాలు, భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన అమ్మాయిలంతా ఒకే లక్ష్యంతో పని చేసి దేశానికి ప్రపంచ కప్‌ను అందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన టీమిండియా సభ్యులు గురువారం రాష్ట్రపతి భవన్‌లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భగా అమ్మాయిల ఘనతలను రాష్ట్రపతి కొనియాడారు. 

వ్యక్తిగతంగా ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించి వారు సాధించిన విజయం అపూర్వమని ఆమె అన్నారు. ‘మన మహిళల క్రికెట్‌ జట్టు అసలైన భారత్‌కు ప్రతీక. భిన్న ప్రాంతాలు, విభిన్న నేపథ్యాలు, వేర్వేరు పరిస్థితుల నుంచి వచ్చినవారు ఒక జట్టుగా ఆడి విజేతగా నిలిచారు. ఎన్నో త్యాగాలు చేసి మరీ వీరంతా ట్రోఫీని సాధించారు. 

న్యూజిలాండ్‌పై గెలుపు తర్వాత మనవాళ్లు సాధించగలరనే నమ్మకం కలిగింది. ఇదే తరహాలో మున్ముందూ మన క్రికెట్‌ను వీరంతా మరింత ముందుకు తీసుకెళతారనే నమ్మకం ఉంది. ముఖ్యంగా కొత్త తరం అమ్మాయిలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు’ అని ముర్ము సందేశానిచ్చారు. ఈ సందర్భంగా జట్టు సభ్యుల సంతకాలతో కూడిన జెర్సీని రాష్ట్రపతికి కెప్టెన్   హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బహుకరించింది.

Videos

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

Photos

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)