Breaking News

బాక్సింగ్‌లో డబుల్‌ స్వర్ణాలు.. ట్రిపుల్‌ జంప్‌లో రెండు పతకాలు

Published on Sat, 08/01/2026 - 15:46

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త మ‌హిళా బాక్స‌ర్ ప్రీతి ప‌వార్ స్వ‌ర్ణం గెలిచింది. మ‌హిళ‌ల 54 కేజీల విభాగంలో ప్రీతి ప‌వార్ కెన‌డాకు చెందిన బాక్స‌ర్ స్కార్లెట్ స‌వ‌న్నాహ్‌పై సునాయాసంగా గెలుపొందింది. తొలి బౌట్ నుంచి ప్రీతి ప‌వార్‌ ప్ర‌త్య‌ర్థిపై పంచ్‌ల‌తో విరుచుకుప‌డింది. ఇక రెండో బౌట్‌లోనూ ప్రీతి త‌న ప్ర‌త్య‌ర్థి ముఖంపై పంచుల వ‌ర్షం కురిపించి ఆధిక్యంలో నిలిచింది. 

ఇక మూడో బౌట్‌లోనూ తనదైన శైలిలో విరుచుకుపడ్డ ప్రీతి పవార్‌ను న్యాయ నిర్ణేతలు యునానిమస్‌ విజయం సాధించినట్లు ప్రకటించారు. కాగా ఈసారి కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బాక్సింగ్‌ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. ఇప్పటికే  బాక్సింగ్‌ విభాగం నుంచి కనీసం 10 పతకాలు ఖాయమైన సంగతి తెలిసిందే. ప్రీతి సాధించిన స్వర్ణం భారత్‌కు 6వ స్వర్ణం కాగా, ఓవరాల్‌గా 24వ పతకం.

👉ఇక మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా కూడా స్వ‌ర్ణం కైవ‌సం చేసుకుంది. ఫైనల్లో జాస్మిన్ ఐర్లాండ్‌కు చెందిన మికెలియాను చిత్తు చేసి పసిడి పతకం సాధించింది. కామ‌న్‌వెల్త్‌లో భార‌త్‌కు ఇది ఏడో స్వ‌ర్ణం కాగా, ఓవ‌రాల్‌గా 25వ ప‌త‌కం.

 

 

👉ఇక పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రవేల్ (16.58 మీటర్ల ఎత్తు) ఎగిరి రజతం ఒడిసిపట్టగా, భారత్‌కే చెందిన మరో అథ్లెట్ సెల్వ ప్రభు (16.52 మీటర్ల ఎత్తు) ఎగిరి కాంస్య పతకం సాధించాడు. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 27కు చేరుకుంది. ఇందులో 7 స్వర్ణాలు, 13 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)