Breaking News

జింబాబ్వేతో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే? విధ్వంసకర వీరుల ఎంట్రీ

Published on Fri, 07/05/2024 - 16:49

విశ్వవిజేతలగా నిలిచిన అనంతరం భారత జట్టు తొలి టీ20 సిరీస్‌కు సిద్దమైంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్లు దూరం కావ‌డంతో భార‌త జ‌ట్టుకు యువ ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. 

ఐపీఎల్ హీరోలు అభిషేక్ శ‌ర్మ‌, రియాన్ ప‌రాగ్‌, సాయిసుద‌ర్శ‌న్‌, తుషార్ దేశ్‌పాండే, హ‌ర్షిత్ రానాల‌కు తొలిసారి భార‌త టీ20 జ‌ట్టులో చోటు ద‌క్కింది. జూలై 6న హరారే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

ఈమ్యాచ్ కోసం గిల్ సారథ్యంలోని భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే హ‌రారేకు చేరుకుంది. తొలి పోరు కోసం తీవ్రంగా యంగ్ టీమిండియా శ్ర‌మించింది. ఈ క్ర‌మంలో తొలి టీ20లో ఆడే భార‌త తుది జ‌ట్టుపై ఓ లూక్కేద్దం.

అభిషేక్, ప‌రాగ్‌ ఎంట్రీ..
ఈ మ్యాచ్‌తో ఎస్ఆర్‌హెచ్ స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శర్మ భార‌త త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది. అత‌డు కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అదే విధంగా ఫ‌స్ట్‌డౌన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను బ్యాటింగ్ దింపే ఆలోచ‌న‌లో జ‌ట్టు మెనెజ్‌మెంట్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక అభిషేక్‌తో పాటు రియాన్ ప‌రాగ్ కూడా డెబ్యూ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అత‌డు మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్ వ‌చ్చే ఛాన్స్ ఉంది. వికెట్ కీప‌ర్‌గా ధ్రువ్ జురెల్‌కు చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది. ఫినిష‌ర్‌గా రింకూ సింగ్  ఎలాగో ఉంటాడు.

ఆల్‌రౌండ‌ర్‌గా వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు ఛాన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక బౌలర్ల‌గా ర‌వి బిష్ణోయ్‌, అవేష్ ఖాన్‌, ఖాలీల్ అహ్మ‌ద్‌, ముఖేష్ కుమార్‌ల స్ధానాలు దాదాపు ఖాయ‌మైన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

భారత తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌, రింకూ సింగ్‌,  వాషింగ్ట‌న్ సుంద‌ర్‌,ర‌వి బిష్ణోయ్‌, అవేష్ ఖాన్‌, ఖాలీల్ అహ్మ‌ద్‌, ముఖేష్ కుమార్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)