Breaking News

మ‌న‌సు మార్చుకున్న గంభీర్‌..!

Published on Fri, 12/05/2025 - 16:51

సౌతాఫ్రికా-భారత్ మధ్య మూడో వన్డేల సిరీస్‌లో కీలక పోరుకు సమయం అసన్నమైంది. శనివారం(డిసెంబర్ 6) వైజాగ్ వేదికగా సిరీస్ డిసైడ‌ర్ అయిన మూడో వ‌న్డేలో ఇరు జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాల‌ని భార‌త్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా వ‌న్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ ఆఖ‌రి పోరులో భార‌త్ ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగనున్న‌ట్లు తెలుస్తోంది.

సుంద‌ర్‌పై వేటు..
ఆల్‌రౌండ‌ర్‌గా జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్ తొలి రెండు వ‌న్డేల‌లోనూ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. మొద‌టి వ‌న్డేలో 13, రాయ్‌పూర్‌లో కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి  నిరాశపరిచాడు. బౌలింగ్‌లో కూడా ఈ త‌మిళ‌నాడు ప్లేయ‌ర్ తేలిపోయాడు.

దీంతో అత‌డిపై వేటు వేయాల‌ని గంభీర్ అండ్ కో సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం. అత‌డి స్దానంలో స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్‌గా రిష‌బ్ పంత్ లేదా తిల‌క్ వ‌ర్మ‌ను తీసుకోవాల‌ని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తుందంట‌. మ‌రోవైపు తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్న ఫాస్ట్ బౌల‌ర్ ప్ర‌సిద్ద్ కృష్ణను కూడా తప్పించనున్నట్లు తెలుస్తోంది. 

అతడి స్దానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌కు అవకాశమివ్వనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. నితీశ్ జట్టులోకి వస్తే బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్‌తో బౌలింగ్ కూడా చేయగలడు. ఎలాగో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్‌, రవీంద్ర జడేజా జట్టులో ఉంటారు. 

అంతేకాకుండా యశస్వి జైశ్వాల్‌పై కూడా వేటు పడనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. జైశ్వాల్ రెండు వన్డేలలోనూ దారుణంగా విఫలమయ్యాడు. కాగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు రాయ్‌పూర్ వన్డేలో ఘోర పరాజయం పాలైంది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని మన బౌలర్లు కాపాడుకోలేకపోయారు.

సౌతాఫ్రికాతో మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ/ రిషబ్‌ పంత్‌ , రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్
చదవండి: ‘తిలక్‌, పంత్‌ ఉన్నా.. అతడిని నమ్మినందుకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందే’

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)