Breaking News

టీమిండియా యువ పేసర్‌కు గాయం.. ఆటకు దూరం

Published on Sat, 01/13/2024 - 14:17

టీమిండియా ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, టీ20 నంబర్‌ వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గై​క్వాడ్‌ ఆటకు దూరంగా ఉన్నారు.

వీళ్లంతా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. మరోవైపు... వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత.. చీలమండ నొప్పితో జట్టుకు దూరమైన సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగనున్న తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో అతడికి స్థానం దక్కలేదు.

ఈ క్రమంలో తాజాగా టీమిండియా మరో బౌలర్‌ గాయపడ్డాడు. యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ తొడ కండరాల నొప్పితో ఆటకు దూరం కావడం గమనార్హం. కాగా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక బౌలర్‌.. రెండు మ్యాచ్‌లు ఆడి ధారాళంగా పరుగులు ఇచ్చుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.

సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో తిరిగి దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించిన ప్రసిద్‌ కృష్ణ.. రంజీ ట్రోఫీ-2024లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా కర్ణాటక- గుజరాత్‌ మధ్య శుక్రవారం మొదలైన టెస్టులో అతడు బరిలోకి దిగాడు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 14.5 ఓవర్లు బౌల్‌ చేసిన ప్రసిద్‌ రెండు వికెట్లు తీశాడు. అయితే, పదిహేనో ఓవర్‌ ఆఖరి బంతి వేసేపుడు తొడ కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ రైటార్మ్‌ పేసర్‌ మైదానాన్ని వీడాడు.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకోవడానికి సుమారు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టనుంది. దీంతో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు.

ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. పేస్‌ దళంలో జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, ఆవేశ్‌ ఖాన్‌ చోటు దక్కించుకున్నారు.  ఇక ప్రసిద్‌ కృష్ణ మాత్రం గాయం కారణంగా మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఆడకపోవచ్చు.

చదవండి: Ind vs Eng: తండ్రి కార్గిల్‌ యుద్ధంలో.. తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)