Breaking News

నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కష్టం

Published on Sun, 01/05/2025 - 04:14

సిడ్నీ: ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కకపోయినా... ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం ఎవరికైనా కష్టమే అని భారత పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ అన్నాడు. సిడ్నీ వికెట్‌ అనూహ్యంగా స్పందిస్తోందని... భారీ స్కోరు చేయడం అంత సులువు కాదని అతడు పేర్కొన్నాడు. 

శనివారం ఆట ముగిసిన అనంతరం ప్రసిధ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. ముఖ్యంగా కొన్ని భాగాల్లో పిచ్‌ను తాకిన తర్వాత తక్కువ ఎత్తులో వస్తోంది. మరికొన్ని చోట్ల బాగా బౌన్స్‌ అవుతోంది. ఇలాంటి చోట ఎంత లక్ష్యం సురక్షితం అని చెప్పలేం. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయతి్నస్తాం. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌ ‘ఎ’ తరఫున ఇక్కడ పర్యటించడం మంచి ఫలితాన్నిచ్చింది.

దానివల్లే సులువుగా బౌలింగ్‌ చేశా. మొదట్లో కాస్త ఒత్తిడికి గురైనా... ఆ వెంటనే పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగా. బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ సూచనలు ఫలితాన్నిచ్చాయి. ప్రాథమిక సూత్రానికి కట్టుబడే బంతులు విసిరా. దాంతోనే ఫలితం రాబట్టగలిగా. 

ఇక ముందు కూడా ఇదే కొనసాగిస్తా. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని వివరించాడు. ‘బోర్డర్‌–గావస్కర్‌’ ట్రోఫీ ఆఖరి టెస్టులో ప్రస్తుతం భారత జట్టు ఓవరాల్‌గా 145 పరుగుల ఆధిక్యంలో ఉంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)