Breaking News

పంజాబ్‌ ఓపెనర్‌ విధ్వంసం​.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో

Published on Sat, 12/28/2024 - 20:30

విజయ్ హజారే ట్రోఫీ-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై జట్టుకు పంజాబ్‌ ఊహించని షాకిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 48.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.

పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే వంటి కీలక వికెట్లను అర్షదీప్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై బ్యాటర్లలో అంకోలేకర్(66) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సూర్యన్ష్‌ షెగ్దే(44), శార్ధూల్‌ ఠాకూర్‌(43) రాణించారు.

ప్రభసిమ్రాన్‌ ఊచకోత..
అనంతరం 249 పరుగుల లక్ష్య చేధనలో ప్రభసిమ్రాన్ సింగ్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ప్రభసిమ్రాన్‌ ఊచకోత కోశాడు. కేవలం 101 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

అతడితో పాటు అభిషేక్‌ శర్మ(66) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌, అయూష్‌ మాత్రే తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఐపీఎల్‌-2025కు ముందు ప్రభసిమ్రాన్‌ సింగ్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రిటైన్‌ చేసుకుంది.
చదవండి: 'భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి'.. రోహిత్‌పై ఎమ్ఎస్కే ఫైర్‌
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)