Breaking News

నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా

Published on Sun, 05/14/2023 - 11:39

ఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన లక్నో.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ లక్నో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ తన సంచలన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.

17 ఓవర్‌ వేసిన అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను లక్నోవైపు తిప్పాడు. కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్‌ 4 సిక్సర్లు, 3 ఫోర్లుతో 44 పరుగులు చేసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన పూరన్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు.

ఐపీఎల్‌లో చరిత్రలోనే తను ఎదుర్కొన్న మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో కేకేఆర్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సునీల్ నరైన్ ముందు వరుసలో ఉన్నాడు. ఐపీఎల్‌-2021లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో డ్యానియల్‌ క్రిస్టయన్‌ బౌలింగ్‌లో వరుసగా తను ఎదుర్కొన్న మొదటి మూడు బంతులను సిక్సర్లగా మలిచాడు.
చదవండి: IPL 2023: అంపైర్‌తో వాగ్వాదం.. హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్‌ షాక్‌! భారీ జరిమానా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)