Breaking News

పొమోనాలో 2028 ఒలింపిక్స్‌ క్రికెట్‌ పోటీలు

Published on Thu, 04/17/2025 - 01:43

దుబాయ్‌: 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పోటీల వేదిక ఖరారైంది. 128 సంవత్సరాల విరామం అనంతరం విశ్వక్రీడల్లో క్రికెట్‌ పునరాగమనం చేస్తుండగా... ఈ పోటీలను దక్షిణ కాలిఫోర్నియాలోని పొమోనా నగరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు జై షా వివరాలు వెల్లడించారు. టి20 ఫార్మాట్‌లో పురుషుల విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ భారత్‌... మహిళల విభాగంలో ప్రస్తుత చాంపియన్‌ న్యూజిలాండ్‌ జట్లతో కూడిన పోస్టర్‌ను ఐసీసీ తమ సామాజిక మాధ్యమాల్లో జత చేసింది.

1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో చివరిసారిగా క్రికెట్‌ పోటీలు నిర్వహించగా... ఈసారి లాస్‌ ఏంజెలిస్‌ వేదికగా జరగనున్న విశ్వక్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో టి20 ఫార్మాట్‌లో టోర్నీ నిర్వహించనున్నారు. రెండు విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొంటాయి. ఒలింపిక్స్‌ ప్రధాన వేదిక లాస్‌ ఏంజెలిస్‌కు పొమోనా 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘పొమోనాలో జరగనున్న పోటీలతో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పునరాగమనం చేయనుంది. 

విశ్వక్రీడల్లో క్రికెట్‌ను భాగం చేయడంతో ఆటకు మరింత ఆదరణ దక్కనుంది. టి20 ఫార్మాట్‌ ద్వారా ఇది విశ్వవ్యాప్తమై మరింత మంది అభిమానుల ఆదరణ దక్కించుకుంటుంది’ అని జై షా పేర్కొన్నాడు. 2023లో ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ 141వ సమావేశంలో... విశ్వక్రీడల్లో క్రికెట్‌ పోటీలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 

2010, 2014, 2023 ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల టి20 క్రికెట్‌ పోటీలు నిర్వహించగా... 2022 బరి్మంగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)