Breaking News

భారత్‌లో తొలి మ్యాచ్‌.. ప్రకటించిన ప్రధాని మోదీ

Published on Fri, 07/10/2026 - 11:02

క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చరిత్రాత్మక ముందడుగు వేసింది. మొట్టమొదటిసారిగా భారత్‌లో బిగ్ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) మ్యాచ్‌ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ సంయుక్తంగా ప్రకటించారు.

దీంతో బీబీఎల్‌ 2026-2027 సీజన్‌లో తొలి మ్యాచ్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం  స్టేడియం (చెపాక్‌) వేదికగా డిసెంబరు 12న ఆరంభ మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ తలపడనున్నాయి.

క్రీడా సంబంధాల బలోపేతం
కాగా విదేశీ టీ20 లీగ్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే ప్రణాళికలో భాగంగా ఇరుదేశాలు ఇందుకు అంగీకరించాయి. 

ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాలో నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆసీస్‌ మీడియా ‘ది ఏజ్‌’ వెల్లడించింది.

మమ్మల్నీ ఆదరించండి
ఇక భారత్‌లో బీబీఎల్‌ మ్యాచ్‌ నిర్వహణ గురించి సీఏ ఎగ్జిక్యూటివ్‌ జనరల్‌ మేనేజర్‌ అలిస్టర్‌ డాబ్సన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో క్రికెట్‌కు ఉన్న అభిమానుల గురించి మాకు తెలుసు. ముఖ్యంగా చెన్నైలో అయితే ఆటకు మరింత ఆదరణ ఉంది. కచ్చితంగా బీబీఎల్‌ మ్యాచ్‌ కోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆశిస్తున్నాం.

ఇప్పటికే ఇండియాలో చాలా మందికి బీబీఎల్‌ గురించి తెలుసు. చాలా మంది బీబీఎల్‌ మ్యాచ్‌లను కూడా చూస్తారు. అందుకే ఈసారి నేరుగా వారి దేశంలోనే బీబీఎల్‌ మ్యాచ్‌ చూసే అవకాశం కల్పిస్తున్నాము. ఐపీఎల్‌ మాదిరే మా పట్ల కూడా ఆదరణ చూపుతారని నమ్ముతున్నాము’’ అని పేర్కొన్నాడు. 

చదవండి: ఆఖరి బంతికి సింగిల్‌.. భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)