Breaking News

ప్రపంచకప్‌ విజేతలకు ప్రధాని అభినందన

Published on Tue, 11/25/2025 - 13:11

న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహించిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సమష్టితత్వం, అంకితభావానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. 

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆదివారం టీమిండియా 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. 

‘మొదటిసారి జరిగిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. ఓటమి ఎరగకుండా ట్రోఫీ నెగ్గడం మరింత గొప్పవిషయం. ఇది నిజంగా చారిత్రాత్మక విజయం. జట్టు సమష్టి కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం. 

ప్రతీ క్రీడాకారిణీ ఒక చాంపియన్‌. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది’ అని ప్రధాని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సెమీస్‌లో ఆ్రస్టేలియాపై విజయం సాధించిన భారత్‌ అంతకుముందు లీగ్‌ దశలో శ్రీలంక, ఆ్రస్టేలియా, నేపాల్, అమెరికా, పాకిస్తాన్‌పై నెగ్గింది.  

అదే విధంగా.. మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ టోర్నీలోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఫైనల్లో చైనీస్‌ తైపీని ఓడించి వరుసగా రెండోసారి చాంపియన్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భారత మహిళా కబడ్డీ జట్టును కూడా అభినందించారు.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)