Breaking News

పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్..?

Published on Tue, 04/22/2025 - 17:51

పాకిస్తాన్ పురుష‌ల క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ ప‌ద‌వి నుంచి ఆకిబ్ జావేద్ త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో పాక్‌ ఘోర ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం జావేద్ త‌న ప‌దవిలో కొన‌సాగ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీంతో హెడ్ కోచ్ లేకుండానే పాక్ జ‌ట్టు న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది.

అక్క‌డ కూడా అదే తీరును మెన్ ఇన్ గ్రీన్ క‌న‌బ‌రిచింది. పాక్ జ‌ట్టు ఈ ఏడాది జూలై ఆఖ‌రిలో వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ వ్య‌వ‌ధిలో త‌మ జ‌ట్టు కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేయాల‌ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. పాకిస్తాన్ హెడ్ కోచ్ రేసులో న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్రికెట్ మాజీ డైరెక్టర్ మైక్ హెస్సన్ ముందంజ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే అత‌డితో పీసీబీ సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం.హెస్సన్ ప్ర‌స్తుతం  పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అత‌డి నేతృత్వంలోనే ఇస్లామాబాద్ యునైటెడ్ గతేడాది పీఎస్‌ఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో కోచ్‌గా అతడికి అపారమైన అనుభవం ఉంది. గతంలో న్యూజిలాండ్ కోచ్‌గా, ఆర్సీబీ క్రికెట్ డైరక్టర్‌గా హెస్సన్ పనిచేశాడు. ఈ క్రమంలోనే అతడిని తమ హెడ్ కోచ్‌గా నియమించాలని పీసీబీ భావిస్తోందంట. అయితే హెడ్ కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సైమన్ కాటిచ్,  న్యూజిలాండ్ ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ ల్యూక్ రోంచిలతో కూడా పీసీబీ సంప్రదింపులు జరిపినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
చ‌ద‌వండి: IPL 2025: రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు భారీ షాక్‌.. ఇక క‌ష్ట‌మే మ‌రి?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)