Breaking News

ఫకర్‌ జమాన్‌కు షోకాజ్‌ నోటీసు

Published on Mon, 10/14/2024 - 20:01

పాకిస్తాన్‌ టాపార్డర్‌ బ్యాటర్‌ ఫకర్‌ జమాన్‌కు ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఇంగ్లండ్‌తో రెండు, మూడు టెస్ట్‌లకు బాబర్‌ ఆజమ్‌ను తప్పిస్తూ సెలెక్షన్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఫకర్‌ జమాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల కారణంగానే పీసీబీ జమాన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

ఇంతకీ ఫకర్‌ జమాన్‌ ఏమన్నాడంటే.. "మన ప్రీమియర్ బ్యాటర్‌ను (బాబర్‌ ఆజమ్‌) తొలగించడం జట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. బోర్డు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి . 2020-23 మధ్యలో భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి కూడా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. 

అయితే అప్పుడు బీసీసీఐ అతన్ని తప్పించలేదు. బాబర్‌ పాకిస్తాన్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్లలో ఒకరు. అతనిపై ఈ తరహా చర్యలు అవసరం లేదు. మన ఆటగాళ్లను వీలైనంత వరకు కాపాడుకోవడానికి చూడాలి" అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చాడు. బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫకర్‌ చేసిన ఈ ట్వీట్‌పై పీసీబీ అసంతృప్తిగా ఉంది. ఈ వ్యాఖ్యలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పీసీబీ ఫకర్‌ను కోరింది. 

పీసీబీ-ఫకర్‌ జమాన్‌ మధ్య గత కొంతకాలంగా సఖ్యత లేదని తెలుస్తుంది. విదేశీ లీగ్‌లు ఆడేందుకు ఎన్‌ఓసీ జారీ చేయడంలో బోర్డు జాప్యం చేస్తుందని ఫకర్‌ గతంలో ఆరోపించాడు. తాజాగా బాబర్‌ ఎపిసోడ్‌ పీసీబీకి, ఫకర్‌కు మధ్య మరింత గ్యాప్‌ పెంచేలా ఉంది.

కాగా, ముల్తాన్‌ టెస్ట్‌లో (తొలి టెస్ట్‌) ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో పాక్‌ సెలెక్టర్లు సీనియర్లైన బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిది, నసీం షాలపై వేటు వేశారు. అలీం దార్‌, అజహర్‌ అలీ, ఆకిబ్‌ జావిద్‌ నేతృత్వంలోని కొత్త సెలెక్షన్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 

చదవండి: ఇండియా-న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)