Breaking News

బాబ‌ర్ ఆజంకు స‌పోర్ట్ .. క‌ట్ చేస్తే! జ‌ట్టులో నో ఛాన్స్‌?

Published on Sun, 10/20/2024 - 09:33

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంత‌రం పాకిస్తాన్ ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా పాక్ జ‌ట్టు మూడు వ‌న్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ వైట్‌బాల్ సిరీస్‌ల కోసం పాక్ సెల‌క్ష‌న్ క‌మిటీ ఒక‌ట్రెండు రోజుల్లో త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించే అవకాశముంది. నవంబ‌ర్ 4న మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేతో పాక్ ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది.

ఫ‌ఖార్ జ‌మాన్‌పై వేటు?
ఇక ఇది ఇలా ఉండ‌గా..  స్టార్ బ్యాట‌ర్ ఫ‌ఖర్ జ‌మాన్‌పై పాక్ సెల‌క్ష‌న్ క‌మిటీ వేటు వేసేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను నుంచి పాక్‌ మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజంను అర్ధంతరంగా  త‌ప్పించ‌డాన్ని జ‌మాన్ త‌ప్పుబ‌ట్టిన విష‌యం తెలిసిందే. సెల‌క్ట‌ర్ల తీరుపై ఎక్స్ వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు.

భార‌త్‌ను చూసి నేర్చుకోవాలంటూ అత‌డు హితువు ప‌లికాడు. దీంతో అత‌డిపై పీసీబీ సీరియ‌స్ అయింది. ఇప్ప‌టికే అత‌డికి పాక్ క్రికెట్ బోర్డు  షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. అంత‌టితో ఆగ‌కుండా ఆసీస్ టూర్‌కు జ‌మాన్‌ను ఎంపిక చేయ‌కూడ‌ని పాక్ బోర్డు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అదేవిధంగా జ‌మాన్ ఇటీవ‌ల నిర్వ‌హించిన ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లో కూడా ఫెయిల్ అయిన‌ట్లు తెలుస్తోంది. మోకాలి సమస్యలతో బాధ‌ప‌డుతున్న 34 ఏళ్ల జ‌మాన్‌..  ఎనిమిది నిమిషాల్లో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడంలో విఫలమైన‌ట్లు స‌మాచారం. ఆసీస్ టూర్‌కు జ‌మాన్ వెళ్తాడా లేదా అన్న‌ది మ‌రో రెండు రోజుల్లో తేలిపోనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)