Breaking News

వారిద్దరి వల్లే ఓడిపోయాము.. మా జట్టులో ఆ సమస్య ఉంది: ఆసీస్‌ కెప్టెన్‌

Published on Sun, 06/15/2025 - 11:09

ఐసీసీ టోర్నీ ఫైన‌ల్ అంటే చెల‌రేగిపోయే ఆస్ట్రేలియాకు ద‌క్షిణాఫ్రికా ఓట‌మి రుచి చూపించింది. లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో సౌతాఫ్రికా చేతిలో ఆసీస్ ప‌రాజ‌యం పాలైంది. 282 ప‌రుగుల లక్ష్యాన్ని ఆసీస్ బౌల‌ర్లు కాపాడుకోలేక‌పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో కంగారులు పై చేయి సాధించిన‌ప్ప‌టికి.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తేలిపోయారు.

ఆసీస్ నిర్ధేశించిన ల‌క్ష్యాన్ని ప్రోటీస్ జ‌ట్టు కేవ‌లం 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. ద‌క్షిణాఫ్రికా స్టార్ ఐడైన్ మార్‌క్ర‌మ్‌(136) అద్బుత‌మైన సెంచ‌రీతో తన జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. అయితే ఐసీసీ టోర్నీ ఫైన‌ల్లో ఆస్ట్రేలియా ఓడిపోవ‌డం 15 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఛాంపియ‌న్స్ సౌతాఫ్రికాపై క‌మ్మిన్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. బౌలింగ్‌, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో అద్బుతంగా రాణించార‌ని అత‌డు కొనియాడాడు.

మిగితా ఫార్మాట్‌ల‌తో పోలిస్తే టెస్టు క్రికెట్‌లో ప‌రిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. మ‌నం ఊహించ‌ని విధంగా పరిస్థితులు చాలా త్వరగా మారవచ్చు. ఈ మ్యాచ్‌లో మేము కొన్ని త‌ప్పులు చేశాము. తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆధిక్యం ల‌భించిన త‌ర్వాత కూడా ప్ర‌త్య‌ర్ధి ముందు స‌రైన టార్గెట్‌ను ఉంచ‌లేకపోయాము.

ఇంకా సెష‌న్ బ్యాటింగ్ చేసి ఉంటే మంచి స్కోర్ వ‌చ్చేండేది. కానీ దక్షిణాఫ్రికా మాకు అవకాశం ఇవ్వలేదు. స్టార్క్-హాజిల్‌వుడ్ కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ప్ర‌తీ ప‌రుగుకు మేము చ‌ప్ప‌ట్లు కొట్టి అభినందించాము. బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ టాప్‌-7లో మాకు కొన్ని స‌మస్య‌లు ఉన్నాయి. రాబోయే వాటిని ప‌రిష్క‌రించుకుంటాము. కానీ జ‌ట్టులో ఉన్న ప్ర‌తీ ఒక్క ప్లేయ‌ర్ గత రెండేళ్లుగా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రచ‌డంతోనే మేము ఇక్క‌డ‌వ‌ర‌కు వ‌చ్చాము. దుర‌దృష్టవశాత్తూ టాస్క్‌ను ఫినిష్ చేయలేకపోయాము.

ఈ మ్యాచ్‌లో కూడా మొద‌టి రెండు రోజుల్లో మా బౌల‌ర్లు బాగా రాణించారు. మేము ప్ర‌తీ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకునేందుకు ప్ర‌య‌త్నించాము. లియ‌న్ నాథన్ లయన్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ అతనికి వికెట్ దక్కలేదు. ఐడెన్ మార్‌క్రమ్‌, టెంబా బావుమా అద్బుతమైన నాక్‌లు ఆడారు. మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. మ్యాచ్ సాగిన నాలుగు రోజుల పాటు వారు ఎక్కడ పట్టు కోల్పోలేదు. విజయానికి వారు పూర్తి అర్హులు" అంటూ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
చదవండి: WTC Final: చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)