Breaking News

రంజీ ట్రోఫీ ఫైనల్లో ఉద్రిక్తత.. కర్ణాటక ఆటగాడిపై జమ్మూ కెప్టెన్‌ దాడి

Published on Wed, 02/25/2026 - 12:08

కర్ణాటక-జమ్మూ అండ్‌ కశ్మీర్‌ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో హైటెన్షన్‌ చోటు చేసుకుంది. మ్యాచ్‌ రెండో రోజు ఫీల్డింగ్‌ చేస్తున్న కర్ణాటక ఆటగాడు కేవీ అనీష్‌పై జమ్మూ కెప్టెన్‌ పరాస్‌ డోగ్రా దాడికి దిగాడు. ఈ హఠాత్పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలిసారి రంజీ ఫైనల్‌కు చేరిన జమ్మూ అండ్‌ కశ్మీర్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ ఎడిషన్‌ ఆధ్యాంతం రాణించినట్లుగానే ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. 

షుభమ్‌ పుండిర్‌ (121) అద్భుత శతకంతో, అరంగేట్రం ఓపెనర్‌ యావెర్‌ హస్సన్‌ (88), అబ్దుల్‌ సమద్‌ (61) అర్ద శతకాలతో సత్తా చాటారు. ఫలితంగా జమ్మూ జట్టు భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. రెండో రోజు తొలి సెషన్‌ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 380 పరుగులు చేసింది. కెప్టెన్‌ పరాస్‌ డోగ్రా (36), కన్హయ్య వధావన్‌ (45) క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, రెండో రోజు ఆట ప్రారంభంలో కర్ణాటక బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, వైశాక్‌ విజయ్‌కుమార్, విద్యాధర్ పాటిల్ బౌన్సర్లతో డోగ్రాను ఇబ్బంది పెట్టారు. ఫీల్డర్లు నిరంతరం స్లెడ్జింగ్‌ చేస్తూ డోగ్రాను రెచ్చగొట్టారు. 101వ ఓవర్‌లో డోగ్రా ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన తర్వాత, షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో నిలిచిన సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ కేవీ అనీష్ వైపు దూసుకెళ్లి, తన హెల్మెట్‌తో అతని తలపై కొట్టాడు. ఊహించని ఈ ఘటనతో మ్యాచ్‌ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

కర్ణాటక సీనియర్‌ ఆటగాడు, టీమిండియా ప్లేయర్‌ మయాంక్‌ అగర్వాల్‌ వెంటనే జోక్యం చేసుకొని డోగ్రాపై సీరియస్‌ అయ్యాడు. అంపైర్లు ఉల్హాస్ గాంధే, రోహన్ పండిట్ గొడవను మరింత పెద్దది కాకుండా ఆటగాళ్లను వేరు చేశారు. కర్ణాటక కెప్టెన్‌ దేవదత్ పడిక్కల్ ఈ ఘటనను మ్యాచ్‌ రిఫరికి నివేదించాడు. ఈ ఘటనకు ముందు కూడా జమ్మూ ఆటగాళ్లు డోగ్రా, కన్హయ్య కర్ణాటక ఆటగాళ్లతో చాలాసార్లు వాగ్వాదానికి దిగారు. ఇది చివరికి ఘర్షణకు దారి తీసింది.  

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు