Breaking News

ఆసియాక‌ప్ జ‌ట్టులో నో ఛాన్స్‌.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ కీల‌క నిర్ణ‌యం

Published on Thu, 08/21/2025 - 07:45

ఆసియాక‌ప్-2025 జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోయిన పాకిస్తాన్ వ‌న్డే కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్  (CPL 2025)లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ త‌రపున ఆడేందుకు రిజ్వాన్ ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు స‌మాచారం.

ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫో ప్ర‌కారం.. సెయింట్ కిట్స్ జ‌ట్టులో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ పేస‌ర్ ఫజల్హాక్ ఫరూఖీ స్ధానాన్ని రిజ్వాన్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. ఫరూఖీ ఆసియా కప్‌కు ముందు యూఏఈ, పాకిస్తాన్‌తో జ‌రిగే ట్రైసిరీస్ ఆడేందుకు అఫ్గాన్ జ‌ట్టులో చేర‌నున్నాడు. 

ఈ క్ర‌మంలోనే రిజ్వాన్‌ను సెయింట్ కిట్స్ యాజ‌మాన్యం త‌మ జ‌ట్టులో తీసుకుంది. ఈ విష‌యంపై మ‌రో 24 గంట‌ల్లో అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. అయితే రిజ్వాన్‌కు ప్ర‌స్తుతం వేరే క‌మిట్‌మెంట్స్ లేక‌పోవ‌డంతో ఈ ఏడాది సీపీఎల్ సీజ‌న్ మొత్తానికి అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు స‌ద‌రు రిపోర్ట్ పేర్కొంది. 

కాగా సీపీఎల్‌లో ఈ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఆడ‌నుండ‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టికే ఈ ఏడాది సీపీఎల్‌లో పాకిస్తాన్ ఆట‌గాళ్లు ఉసామా మీర్‌, అబ్బాస్ అఫ్రిది. ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్, నసీమ్ షా, సల్మాన్ ఇర్షాద్ వంటి స్టార్ ఆట‌గాళ్లు భాగ‌మ‌య్యారు. ఇప్పుడు రిజ్వాన్ వారి స‌ర‌స‌న చేర‌నున్నాడు. 

కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) త‌మ కాంట్రాక్ట్ ఆట‌గాళ్ల‌ను 12 నెలల వ్యవధిలో రెండు టీ20 లీగ్‌లలో మాత్రమే పాల్గొనడానికి అనుమ‌తి ఇస్తుంది. రిజ్వాన్ ఇప్పుడు సీపీఎల్‌, ఆ త‌ర్వాత బిగ్‌బాష్ లీగ్ 2025-26లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు. 

దీంతో ఈ 12 నెలల కాలానికి రిజ్వాన్ ఫ్రాంచైజీ లీగ్‌ల కోటా పూర్తి కానుంది. రిజ్వాన్‌కు  టీ20ల్లో మంచి రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 286 టీ20లు ఆడి 43 సగటుతో 8421 పరుగులు చేశాడు. అయితే ఇటీవ‌ల కాలంలో అత‌డి ఫామ్ దిగ‌జార‌డంతో పాక్ టీ20 జ‌ట్టులో చోటు కోల్పోయాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో మెరుగ్గా రాణించి తిరిగి టీ20 జ‌ట్టులోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా రిజ్వాన్ ముందుకు వెళ్తున్నాడు.
చదవండి: Prithvi Shaw: తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలం
 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)