Breaking News

భారత్‌కు వచ్చేందుకు పాక్‌ క్రికెట్‌ టీమ్‌ నిరాకరణ..?

Published on Sat, 09/06/2025 - 12:14

మహిళల వన్డే ప్రపంచ కప్‌ ఓపెనింగ్‌ సెర్మనీ కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో అడుగుపెట్టేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌కు ముందు గౌహతిలోని బార్సపరా స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగాల్సి ఉన్నాయి. ఇందు కోసం టోర్నీలో పాల్గొనే జట్లన్నీ హాజరుకానున్నాయి. అయితే భారత్‌తో సత్సంబంధాలు లేని కారణంగా పాక్‌ ఈ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఓపెనింగ్‌ సెర్మనీలో ప్రముఖ బాలీవుడ్‌ గాయని శ్రేయా ఘోసల్‌తో లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఏర్పాటు చేయబడింది. ఈ వేడుకను ఐసీసీ గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది. ఓపెనింగ్‌ సెర్మనీ అనంతరం కెప్టెన్ల ఫోటో షూట్‌, ప్రత్యేక మీడియా సమావేశం కూడా జరునున్నాయి. వీటికి కూడా పాక్‌ దూరం కానుందని సమాచారం.

భారత్–పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 2008 నుంచి నిలిచిపోయిన విషయం​ తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ సంబంధాలు మరింత క్షీణించాయి. బీసీసీఐ-పీసీబీ ఒప్పందం మేరకు ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడనున్నాయి. అది కూడా తటస్ట్‌ వేదికల్లో మాత్రమే.

త్వరలో ప్రారంభం కాబోయే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. ఆ జట్టు అక్టోబర్‌ 2న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 5న కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది. 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)