Breaking News

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ నిష్క్ర‌మ‌ణ‌

Published on Sun, 06/21/2026 - 09:26

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 నుంచి నిష్క్ర‌మించిన తొలి జ‌ట్టుగా పాకిస్తాన్ నిలిచింది. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌కు టోర్నీలో ఇది హ్యాట్రిక్ ప‌రాజ‌యం. ఇంత‌క‌ముందు భార‌త్‌, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టు తాజాగా శ‌నివారం బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మితో నాకౌట్ ద‌శ‌కు చేర‌కుండానే టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. 

అంత‌క‌ముందు ఆస్ట్రేలియా జ‌ట్టు నెద‌ర్లాండ్స్‌పై భారీ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌కు చేరుకోవ‌డంతో పాకిస్తాన్‌తో పాటు నెద‌ర్లాండ్స్ కూడా మూడు ఓట‌ముల‌తో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది. సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 23 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజ‌యం సాధించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో షోర్నా అక్తెర్‌ (39 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించింది.  అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్‌ ఆదిలో బాగా ఆడినా, మధ్యలో లయ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్‌ ఫెరోజా (23) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించగా.. ఆతర్వాత పాక్‌ 26 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది.

పాకిస్తాన్ క్రికెట్‌కు ప్ర‌స్తుతం సంధికాలం న‌డుస్తోంది. అటు పురుషులు.. ఇటు మ‌హిళ‌ల జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో నాకౌట్ చేర‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. ఫిబ్ర‌వ‌రిలో జరిగిన పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ సూప‌ర్‌-8 ద‌శ‌లోనే ఇంటిబాట ప‌ట్టింది. ఆ త‌ర్వాత బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయింది. 

తాజాగా మ‌హిళ‌ల జ‌ట్టు కూడా పురుషుల జట్టునే అనుస‌రించింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ చేతుల్లో హ్యాట్రిక్ ఓట‌ములు చ‌విచూసి టోర్నీ నుంచి భారంగా నిష్క్ర‌మించింది. 2009 ఆరంభ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ప్ర‌తీసారి బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టు ఏనాడు ఫ‌స్ట్ రౌండ్ దాటింది లేదు. ఈసారి కూడా ఆ చెత్త‌ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డంలో విఫ‌ల‌మైంది.

మ‌రోవైపు ఇదే గ్రూప్‌లో ఉన్న భారత మ‌హిళ‌ల జ‌ట్టు మాత్రం రెండు విజ‌యాల‌తో ఆసీస్ త‌ర్వాతి స్థానంలో ఉంది. ఇవాళ సౌతాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో గెలిచి నాకౌట్‌కు చేరుకోవాల‌ని హ‌ర్మ‌న్ సేన ఉవ్విళ్లూరుతోంది.

 

చదవండి: 11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)