Breaking News

PAK VS WI 2nd Test: టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఇలా..!

Published on Sun, 01/26/2025 - 19:25

టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి రోజు ఏకంగా 20 వికెట్లు పడ్డాయి. ఆసియా ఖండంలో టెస్ట్‌ మ్యాచ్‌ తొలి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ ఆసియా పిచ్‌లపై తొలి రోజే 20 వికెట్లు పడలేదు. తొలి రోజు పడిన వికెట్లలో 16 స్సిన్నర్లకు దక్కగా.. 4 పేస్‌ బౌలర్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌ తొలి రోజు తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 163 పరుగులకు ఆలౌటైంది. నౌమన్‌ అలీ హ్యాట్రిక్‌ సహా ఆరు వికెట్లు పడగొట్టి విండీస్‌ నడ్డి విరిచాడు. సాజిద్‌ ఖాన్‌ 2, అబ్రార్‌ అహ్మద్‌, కషిఫ్‌ అలీ తలో వికెట్‌ తీశారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు గడకేశ్‌ మోటీ (55), కీమర్‌ రోచ్‌ (25), గోమెల్‌ వార్రికన్‌ (36 నాటౌట్‌), కవెమ్‌ హాడ్జ్‌ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి పాక్‌ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. గోమెల్‌ వార్రికన్‌ 4, గుడకేశ్‌ మోటీ 3, కీమర్‌ రోచ్‌ 2 వికెట్లు పడగొట్టారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సౌద్‌ షకీల్‌ 32 పరుగులు చేశాడు. షాన్‌ మసూద్‌ 15, ముహమ్మద్‌ హురైరా 9, బాబర్‌ ఆజమ్‌ 1, కమ్రాన్‌ గులామ్‌ 16, సల్మాన్‌ అఘా 9, నౌమన్‌ అలీ 0, సాజిద్‌ ఖాన్‌ 16 (నాటౌట్‌), అబ్రార్‌ అహ్మద్‌ 2, కషిఫ్‌ అలీ డకౌటయ్యారు.

9 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ 244 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్‌ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్‌ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్‌ ఇమ్లాచ్‌ (35), కెవిన్‌ సింక్లెయిర్‌ (28), గుడకేశ్‌ మోటీ (18), గోమెల్‌ వార్రికన్‌ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో సాజిద్‌ ఖాన్‌, నౌమన్‌ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్‌ అలీ, అబ్రార్‌ అహ్మద్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (2), ముహమ్మద్‌ హురైరా (2), కమ్రాన్‌ గులామ్‌ (19) నిరాశపరచగా.. బాబర్‌ ఆజమ్‌ (31) మరోసారి లభించిన శుభారంభాన్ని భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు.

సౌద్‌ షకీల్‌ (13)తో పాటు కషిఫ్‌ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలవాలంటే మరో 178 పరుగులు చేయాలి. విండీస్‌ బౌలర్లలో కెవిన్‌ సింక్లెయిర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్‌ మోటీ, జోమెల్‌ వార్రికన్ తలో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్‌ తొలి టెస్ట్‌లో 127 పరుగుల తేడాతో నెగ్గింది.


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)