Breaking News

SL Vs ZIM: రాణించిన సికందర్‌ రజా.. కష్టాల్లో శ్రీలంక

Published on Thu, 11/20/2025 - 21:29

పాకిస్తాన్‌ ట్రై సిరీస్‌లో ఇవాళ (నవంబర్‌ 20) జింబాబ్వే, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (49), కెప్టెన్‌ సికందర్‌ రజా (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. మిగతా వారంతా విఫలమయ్యారు.

మరుమణి 10, బ్రెండన్‌ టేలర్‌ 11, ర్యాన్‌ బర్ల్‌ 18, మున్యోంగ డకౌట్‌, ముసేకివా 11, బ్రాడ్‌ ఈవాన్స్‌ 4 పరుగులు చేసి ఔటయ్యారు. మపోసా 5, క్రెమర్‌ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో నువాన్‌ తుషార (3-0-30-0) మినహా అందూ పొదుపుగా బౌలింగ్‌ చేశారు. హసరంగ 3 వికెట్లతో సత్తా చాటగా.. ఎషాన్‌ మలింగ 2, తీక్షణ, చమీరా తలో వికెట్‌ తీశారు.

52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక
అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. నిస్సంక​ (0), కుసాల్‌ మెండిస్‌ (6), కుసాల్‌ పెరీరా (4), భానుక రాజపక్స (11), కమిందు మెండిస్‌ (9) ఔట్‌ కాగా.. షనక (17), హసరంగ క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, పాకిస్తాన్‌ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఓ మ్యాచ్‌ జరిగింది. నవంబర్‌ 18న జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది.

బెన్నెట్‌ (49), మరుమణి (30), సికందర్‌ రజా (34 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. పాక్‌ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి జింబాబ్వేను దెబ్బకొట్టారు.

లక్ష్య ఛేదనలో పాక్‌ సైతం తడబడినప్పటికీ.. అంతింగా విజయం సాధించింది. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫకర్‌ జమాన్‌ (44), ఉస్మాన్‌ ఖాన్‌ (37 నాటౌట్‌) రాణించారు. బంతితో (4-0-22-2) సత్తా చాటిన మొహమ్మద్‌ నవాజ్‌ (21 నాటౌట్‌) బ్యాట్‌తోనూ రాణించి పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)