Breaking News

ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీనా?

Published on Mon, 11/10/2025 - 08:22

హాం​కాంగ్ సిక్సెస్-2025 విజేతగా పాకిస్తాన్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో కువైట్‌ను చిత్తు చేసిన పాక్‌.. రికార్డు స్దాయిలో ఆరోసారి హాంకాంగ్ సిక్సెస్ టైటిల్‌ను ముద్దాడింది. అబ్బాస్ అఫ్రిది నాయకత్వంలో పాక్ జట్టు భారత్‌పై ఓటమి పాలైనప్పటికి.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఫైనల్లో విజయం తర్వాత పాక్ ఆటగాడు మహ్మద్ షాజాద్  ఓవరాక్షన్ చేశాడు.

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐకానిక్ ట్రోఫీ సెలబ్రేషన్‌ను మహ్మద్ షాజాద్ కాపీ చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత పాండ్యా ట్రోఫీని త‌న ముందు పెట్టుకుని భుజాలు ఎగరేస్తూ ఫోటోల‌కు పోజ్ ఇచ్చాడు. ఇప్పుడు షాజాద్ కూడా అదే విధంగా చేశాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అందుకు క్యాప్ష‌న్‌గా హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ ఫ‌న్ ముగిసింది. ఇక్క‌డ మాకు మ‌ద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు. ఛాంపియ‌న్‌షిప్‌ను సొంతం చేసుకోవ‌డం ఎల్లప్పుడూ ప్ర‌త్యేక అనుభూతిని క‌లిగిస్తోంది అని షాజాద్ ఇచ్చాడు.

అయితే షాజాద్‌ భార‌త కెప్టెన్ దినేష్ కార్తీక్‌కు కౌంట‌ర్‌గా ఈ పోస్ట్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో పాక్‌పై విజ‌యం త‌ర్వాత కార్తీక్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు. పాకిస్తాన్‌పై విజ‌యంతో హాంకాంగ్ సిక్సెస్ ఫ‌న్ మొద‌లైంది అంటూ కార్తీక్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

ఇప్పుడు ఫ‌న్ ముగిసిందని షెజాద్‌ అతి చేశాడు. ఇందుకు సంబంధిం‍చిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీంతో షెజాద్‌పై నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచమైనా మీకు సిగ్గు ఉందా?  సెల‌బ్రేష‌న్స్ కూడా కాపీనేనా అనా ఓ యూజ‌ర్ కామెంట్ చేశాడు. మీరు ఏమైనా వరల్డ్‌కప్ ట్రోఫీని సాధించారా? ఆ పోజులు ఏంటి? అని సొంత అభిమానుల సైతం షెజాద్‌పై ఫైరవతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)