Breaking News

'వారిని బూట్లతో కొట్టాలి.. పాక్ క్రికెట్‌ను నాశ‌నం చేశారు'

Published on Mon, 03/31/2025 - 19:05

అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్ ఓట‌ముల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం పాకిస్తాన్ జ‌ట్టు.. వైట్‌బాల్ సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. అక్క‌డ కూడా పాక్ జ‌ట్టు ఆట‌తీరు ఏ మాత్రం మార‌లేదు. తొలుత కివీస్‌తో జ‌రిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్‌.. ఇప్పుడు వ‌న్డే సిరీస్‌లో కూడా అదే దిశ‌గా కొన‌సాగుతోంది. 

మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా నేపియ‌ర్ వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్‌లో 73 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. 345 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌డంలో రిజ్వాన్ సేన చ‌త‌క‌ల‌ప‌డింది. ల‌క్ష్య చేధ‌న‌లో మంచి ఆరంభం ల‌భించిన‌ప్ప‌టికి మిడిలార్డ‌ర్ విఫ‌ల‌మం కావ‌డంతో పాక్ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. 

రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఫిలిప్స్‌, కాన్వే, హెన్రి వంటి స్టార్ ప్లేయ‌ర్లు కివీస్ జ‌ట్టులో లేన‌ప్ప‌టికి.. పాకిస్తాన్ ఓడిపోవ‌డాన్ని ఆ దేశ మాజీలు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో పాక్ జ‌ట్టుపై మాజీ క్రికెట‌ర్ బాసిత్ అలీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించాడు. అదేవిధంగా స్టార్ క్రికెట‌ర్‌ బాబ‌ర్ ఆజం బ్యాటింగ్ పొజిష‌న్‌పై కూడా అలీ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

"బాబర్ ఎందుకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలి?. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఓపెనింగ్ చేశాడు. చాలా మంది ఓపెన‌ర్‌గానే బాబ‌ర్ రావాల‌ని సూచించారు. అసలు ఎవరా క్రికెట్ ప్రొఫెసర్స్? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?  వారి వాళ్లే బాబర్ ఓపెన‌ర్‌గా బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. 

ఇప్పుడు మూడో స్ధానంలో వ‌చ్చి బాబ‌ర్ ఎలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు? క్రికెట్ ప్రొఫెసర్స్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి దేశానికి క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు ఎవరూ బయటకు రారు. ఇలా క్రికెట్ ప్రొఫెసర్స్ అవ్వాలనుకునేవారిని బూట్లతో కొట్టాలి. బాబర్‌, రిజ్వాన్‌లను ఓపెనర్లుగా చేసిన వారే పాకిస్తాన్ క్రికెట్‌ను నాశ‌నం చేశారు. పాకిస్థాన్ జట్టు ఫ్రాంచైజీ జట్టుగా మారిపోయింది" అని అలీ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.
చ‌ద‌వండి: IPL 2025: ఏంటి ప‌రాగ్ బ్రో ఇది.. ఎందుకంత యాటిట్యూడ్‌? వీడియో వైర‌ల్‌

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు