Breaking News

భారత స్టార్‌ను కిందకి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన పాక్‌ ప్లేయర్‌

Published on Tue, 02/17/2026 - 17:17

ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ ప్లేయర్లకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్టార్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. టాప్‌ ప్లేస్‌కు పాక్‌ స్పిన్నర్‌ సదియా ఇక్బాల్‌ ఎగబాకింది. 

గత వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉండిన సదియా రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. సదియా (743), దీప్తి శర్మ (729) మధ్య పాయింట్ల వ్యత్యాసం 14 పాయింట్లు మాత్రమే. 

ఆసీస్‌ పర్యటన తొలి టీ20లో పెద్దగా ప్రభావం (2-0-19-1) చూపకపోవడంతో దీప్తి టాప్‌ ర్యాంక్‌ను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు సదియా సౌతాఫ్రికాతో తాజాగా జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 5.82 ఎకానమీతో 5 వికెట్లు తీసి టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది.

టాప్‌-10లోకి దూసుకొచ్చిన రేణుకా సింగ్‌
తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ పేసర్‌ రేణుకా సింగ్‌ టాప్‌-10లోకి దూసుకొచ్చింది. ఆసీస్‌పై తొలి టీ20లో అద్భుత ప్రదర్శన (4-1-14-2) కనబర్చడంతో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకింది.

అరుంధతి అదుర్స్‌
ఇదే మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా (4-0-22-4) చెలరేగిన మరో భారత పేసర్‌ అరుంధతి రెడ్డి ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకొని 17వ స్థానానికి ఎగబాకింది. ఇదే మ్యాచ్‌లో రాణించిన స్పిన్నర్‌ శ్రీచరణి (3-0-14-2) ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని 39వ స్థానానికి ఎగబాకింది.

బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ వారం పెద్దగా మార్పుల్లేవు. బెత్‌ మూనీ, హేలీ మాథ్యూస్‌, స్మృతి మంధన టాప్‌-3లో కొనసాగుతున్నారు. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా.. జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు. 

పాక్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా ఏకంగా 31 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి ఎగబాకింది. మిగతా చెప్పుకోదగ్గ మార్పుల్లో సౌతాఫ్రికా బ్యాటర్‌ అనెరీ​ డెర్క్‌సన్‌ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 76కు.. ఆసీస్‌ బ్యాటర్‌ జార్జియా వేర్హమ్‌ 9 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకారు.

ఆల్‌రౌండర్ల విభాగంలోనూ పెద్దగా మార్పుల్లేవు. హేలీ మాథ్యూస్‌, అమేలియా కెర్‌, దీప్తి శర్మ టాప్‌-3లో కొనసాగుతుండగా.. పాక్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా మాత్రం 5 స్థానాలు మెరుగుపర్చుకొని ఆరో స్థానానికి చేరింది.

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)