Breaking News

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకిన పాక్‌ ప్లేయర్‌

Published on Tue, 05/27/2025 - 20:05

ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ బౌలర్‌ సదియా ఇక్బాల్‌ అగ్రస్థానానికి ఎగబాకింది. సదియా.. ఇంగ్లండ్‌ బౌలర్‌ సోఫీ ఎక్లెస్టోన్‌ను కిందకు దించి టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండిన సదియా ఓ స్థానం మెరుగుపర్చుకుంది.

తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఎక్లెస్టోన్‌ పాల్గొనకపోవడంతో సదియా అగ్రపీఠాన్ని దక్కించుకుంది. సదియా ఖాతాలో 746 రేటింగ్‌ పాయింట్లు ఉండగా.. ఎక్లెస్టోన్‌ ఖాతాలో 734 పాయింట్లు ఉన్నాయి. ఎక్లెస్టోన్‌ మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయింది.

భారత స్టార్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ (737 పాయింట్లు), ఆసీస్‌ బౌలర్‌ అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు ఎగబాకారు. భారత పేసర్‌ రేణుక సింగ్‌ ఠాకూర్‌ ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఇంగ్లండ్‌ బౌలర్‌ లారెన్‌ బెల్‌ ఏకంగా 13 స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. మరో ఇంగ్లండ్‌ బౌలర్‌ చార్లీ డీన్‌, పాకిస్తాన్‌ బౌలర్‌ సష్రా సంధు, ఆస్ట్రేలియా బౌలర్‌ జార్జియా వేర్హమ్‌ ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్‌ సారా గ్లెన్‌ నాలుగు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ 16, శ్రేయాంక పాటిల్‌ 21, పూజా వస్త్రాకర్‌ 33 స్థానాల్లో ఉన్నారు.

బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బెత్‌ మూనీ టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకుంది. విండీస్‌ స్టార్‌ బ్యాటర్‌ హేలీ మాథ్యూస్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగు నుండి రెండో స్థానానికి చేరింది. 

ఆసీస్‌ బ్యాటర్‌ తహిళ మెక్‌గ్రాత్‌, టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన తలో స్థానం కోల్పోయి మూడు, నాలుగు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్‌, అమేలియా కెర్‌, దీప్తి శర్మ టాప్‌-3లో కొనసాగుతున్నారు.  
 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)