Breaking News

దోబూచులాడుతున్న టాప్‌ ర్యాంకింగ్‌.. మళ్లీ నంబర్‌ వన్‌ స్థానానికి చేరిన పాక్‌

Published on Mon, 09/18/2023 - 15:20

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం మూడు జట్ల మధ్య దోబూచులాడుతుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ముందు టాప్‌ ప్లేస్‌ పాకిస్తాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా జట్లతో మ్యూజికల్‌ ఛైర్స్‌ గేమ్‌ ఆడుతుంది. ఈ మూడు జట్లలో ఒక్కో జట్టు ఒక్కో రోజు అగ్రస్థానంలో ఉంటుంది. ఈ నెలలో ఏ జట్టు వరుసగా ఓ వారం​ పాటు టాప్‌ ప్లేస్‌లో లేదు. మూడు జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం ఒకటి, అర ఉండటమే ఈ దోబూచులాటకు కారణం.

సెప్టెంబర్‌ 14న అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాతో ఐదో వన్డేలో ఓటమిపాలు కావడంతో తమ అగ్రపీఠాన్ని పాక్‌కు చేజార్చుకుంది. పాక్‌.. ఆసియా కప్‌-2023లో సూపర్‌ ఫోర్‌ దశలోనే నిష్క్రమించినా తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇదే సమయంలో టీమిండియా ఆసియా కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నా.. సూపర్‌ ఫోర్‌ దశలో బంగ్లాదేశ్‌తో చేతిలో ఓడిపోవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

ప్రస్తుతం భారత్‌, పాక్‌లకు సమానంగా 115 పాయింట్లు ఉన్నా పాక్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 113 పాయింట్లు కలిగి ఉంది. టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్‌ 22న ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంటుంది. ఇదే గనక జరిగితే టీమిండియా ఒకేసారి మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగే జట్టుగా రికార్డుల్లోకెక్కుతుంది.

భారత్‌ ప్రస్తుతం టెస్ట్‌, టీ20ల్లో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుంది. ఆసీస్‌తో సిరీస్‌ను భారత్‌ గెలిస్తే అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో ఉన్న జట్టుగా ప్రపంచకప్‌ బరిలోకి దిగుతుంది. కాగా, ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్‌ 22, 24, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్‌ అనంతరం అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్‌కప్‌ జర్నీ స్టార్ట్‌ అవుతుంది. అక్టోబర్‌ 14న భారత్‌.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)