ప్రపంచకప్‌ సందర్భంగా పాక్‌ క్రికెటర్‌ అసభ్య ప్రవర్తన.. మహిళతో..!

Published on Thu, 03/05/2026 - 11:58

పాకిస్తాన్‌ క్రికెటర్‌కు సంబంధించి ఆలస్యంగా వెలుగు చూసిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. టీ20 ప్రపంచకప్‌ 2026 సందర్భంగా ఓ పాక్‌ క్రికెటర్‌ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. సూపర్‌-8 దశలో శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఈ ఘటన జరిగిందని సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్‌ జట్టు ఫిబ్రవరి 28న పల్లెకెలెలో శ్రీలంకతో తమ చివరి సూపర్‌-8 మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు, కాండీ (శ్రీలంక)లోని గోల్డెన్ క్రౌన్ హోటల్‌లో ఓ పాక్‌ ఆటగాడు మహిళా హౌస్‌కీపింగ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

సదరు మహిళ సాయం కోసం కేకలు వేయగా, ఇతర హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని తెలుస్తుంది. ఈ విషయం పాక్‌ మేనేజర్ నవీద్ చీమాకు తెలియజేయగా.. ఆయన హోటల్ మేనేజ్‌మెంట్‌కు క్షమాపణ చెప్పి సమస్యను అంతర్గతంగా పరిష్కరించాడని సమాచారం.  

మహిళను వేధించిన ఆ పాక్‌ ఆటగాడి పేరు బహిరంగంగా వెల్లడించకపోయినా, జట్టు మేనేజ్‌మెంట్ అతనిపై కఠన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా భారీ జరిమానా విధించినట్లు సమాచారం. ఈ ఘటనపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సదరు ఆటగాడిపై నక్వీ అదనపు చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.

కాగా, పాక్‌ ఆటగాళ్లపై, సపోర్ట్‌ స్టాఫ్‌పై గతంలో ఇలాంటి ఆరోపణలు చాలానే వచ్చాయి. పాక్‌ బృందం దురుసు ప్రవర్తనకు మారు పేరని ప్రపంచ క్రికెట్‌ దేశాల హోటల్‌ యాజమాన్యాలన్నీ ముక్తకంఠంతో చెబుతాయి. పాక్‌ ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు షరామామూలే.

ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో పాక్‌ ఘోర ప్రదర్శనలు చేసి సూపర్‌-8 దశలోనే నిష్క్రమించింది. చివరి సూపర్‌-8 మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ తేడాతో గెలుచుంటే, న్యూజిలాండ్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ సాధించి సెమీస్‌కు అర్హత సాధించి ఉండేది. 

అయితే లంక ఆటగాళ్లు అద్భుతంగా ప్రతిఘటించి పాక్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కనీయకుండా చేశారు. లంకపై భారీ స్కోర్‌ చేసినా గెలిచినా, పాక్‌ ఇంటిముఖం పట్టక తప్పలేదు. పాక్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న కారణంగా గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌తో పాటు న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరింది. ఇదే న్యూజిలాండ్‌ జట్టు సెమీస్‌లో గ్రూప్‌-1 టాపర్‌ సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో న్యూజిలాండ్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)