Breaking News

#MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా!

Published on Wed, 05/31/2023 - 08:15

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే విజేతగా నిలవడంపై దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌ మొత్తం ధోని నామస్మరణతోనే మార్మోగిపోయింది. సీఎస్‌కే ఎక్కడ మ్యాచ్‌ ఆడినా అభిమానులు తండోపతండాలుగా వచ్చేవారు. దీనికి ప్రధాన కారణం సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని. ధోని భజన మరీ ఎక్కువైపోయిందన్నా పర్లేదు.. కానీ ఒక విషయం మాత్రం తప్పక తెలుసుకోవాల్సిందే.

సీఎస్‌కే విజేతగా నిలవడంపై మన దేశ అభిమానులే కాదు.. దాయాది దేశం పాకిస్తాన్‌ అభిమానులు కూడా తెగ సంతోషపడిపోయారు. సీఎస్‌కే ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత పాకిస్తాన్‌లో కొన్నిచోట్ల క్రికెట్‌ ఫ్యాన్స్‌ సెలబ్రేట్‌ చేసుకోవడం కనిపించింది. ధోని కటౌట్స్‌తో వీధుల్లో తిరుగుతూ భారీ ఎత్తున కేక్‌ కటింగ్స్‌ నిర్వహించారు. ఈ చర్యతో వైరం అనేది దేశాల మధ్యే కానీ ఆటపై కాదని తెలియజేశారు.

ఇక పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు రమీజ్‌ రజా, సక్లెయిన్‌ ముస్తాక్‌, షోయబ్‌ అక్తర్‌, సయీద్‌ అన్వర్‌ సహా మరికొంతమంది సీఎస్‌కే టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక ధోని టైటిల్‌ గెలిచిన అనంతరం మాట్లాడుతూ కాస్త ఎమోషన్‌కు గురయ్యాడు. రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అనిపించినప్పటికి వచ్చే సీజన్‌ ఆడాలా వద్దా అనే దానిపై మరో ఏడు, ఎనిమిది నెలల్లో తుది నిర్ణయం తీసుకుంటా. అప్పటికి శరీరం సహకరించి ఫిట్‌గా ఉంటే అభిమానుల కోసం మరో ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ పేర్కొన్నాడు.

చదవండి: ఒక్క ఆటోగ్రాఫ్‌ కోసం బతిమాలించుకున్నాడు!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)