వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌

Published on Fri, 07/12/2024 - 21:12

పాకిస్తాన్‌ ఛాంపియన్స్‌ జట్టు వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 12) సాయంత్రం జరిగిన తొలి సెమీస్‌లో పాక్‌ టీమ్‌.. వెస్టిండీస్‌ ఛాంపియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం​ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. 

పాక్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ యూనిస్‌ ఖాన్‌ (65), కమ్రాన్‌ అక్మల్‌ (46), ఆమెర్‌ యామిన్‌ (40 నాటౌట్‌), సోహైల్‌ తన్వీర్‌ (33) సత్తా చాటగా.. షాహిద్‌ అఫ్రిది (1), షోయబ్‌ మాలిక్‌ (0), మిస్బా ఉల్‌ హక్‌ (0) విఫలమయ్యారు. విండీస్‌ బౌలర్లలో ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌ 3, సులేమాన్‌ బెన్‌ 2, జెరోమ్‌ టేలర్‌, డ్వేన్‌ స్మిత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌.. 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటై, ఓటమిపాలైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఆష్లే నర్స్‌ (36) టాప్‌ స్కోరర్‌గా కాగా.. డ్వేన్‌ స్మిత్‌ (26), క్రిస్‌ గేల్‌ (22), రయాద్‌ ఎమ్రిట్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో సోహైల్‌ ఖాన్‌ 4, వాహబ్‌ రియాజ్‌, షోయబ్‌ మాలిక్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. రెండో సెమీఫైనల్లో భారత్‌, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.

 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)