Breaking News

పాకిస్తాన్‌ జోరు

Published on Fri, 09/12/2025 - 23:33

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 టోర్నీని పాకిస్తాన్‌ జట్టు విజయంతో మొదలు పెట్టింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ 93 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది. తొలిసారి ఆసియా కప్‌ బరిలోకి దిగిన ఒమన్‌ జట్టు పాక్‌ బౌలింగ్‌ ముందు నిలబడలేకపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా...ఛేదనలో ఒమన్‌ 16.4 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. 

అబుదాబిలో నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలపడతాయి. ఓపెనర్‌ సయీమ్‌ అయూబ్‌ (0) డకౌట్‌ కాగా... మొహమ్మద్‌ హరీస్‌ (43 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (29 బంతుల్లో 29; 1 ఫోర్‌) కలిసి పాక్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆరంభంలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఒమన్‌ సఫలమైనా...ఆ తర్వాత పట్టు విడిచింది. 

హరీస్, ఫర్హాన్‌ రెండో వికెట్‌కు 64 బంతుల్లో 85 పరుగులు జోడించారు. కెప్టెన్  సల్మాన్‌ ఆఘా (0) తొలి బంతికే వెనుదిరగ్గా... ఫఖర్‌ జమాన్‌ (23 నాటౌట్‌; 2 ఫోర్లు), మొహమ్మద్‌ నవాజ్‌ (19 నాటౌట్‌) కూడా కీలక పరుగులు జత చేయడంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఒమన్‌ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్‌ కలీమ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఒమన్‌ పూర్తిగా చేతులెత్తేసింది. 

హమ్మద్‌ మీర్జా (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఎవరూ కనీసం క్రీజ్‌లో నిలబడలేకపోయారు. పాకిస్తాన్‌ తరఫున ఫహీమ్‌ అష్రఫ్, ముఖీమ్, అయూబ్‌ తలా 2 వికెట్లు తీశారు. పాక్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో రేపు భారత్‌ను ఎదుర్కొంటుంది.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)