Breaking News

ఎట్టకేలకు పాకిస్తాన్‌కు ఓ విజయం

Published on Thu, 07/24/2025 - 21:34

బంగ్లాదేశ్‌ పర్యటనలో పాకిస్తాన్‌ ఎట్టకేలకు ఓ విజయం​ సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ఇదివరకే సిరీస్‌ కోల్పోయిన ఆ జట్టు, ఇవాళ (జులై 24) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో కంటితుడుపు విజయం నమోదు చేసింది. 

ఢాకాలోని షేర్‌ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 74 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (63) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. 

పాక్‌ ఇన్నింగ్స్‌లో హసన్‌ నవాజ్‌ (33), మొహమ్మద్‌ నవాజ్‌ (27), సైమ్‌ అయూబ్‌ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ 3, నసుమ్‌ అహ్మద్‌ 2, షొరిఫుల్‌ ఇస్లాం, సైఫుద్దీన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌.. పాక్‌ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16.4 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. తద్వారా సిరీస్‌లో తొలి పరాజయం ఎదుర్కొంది. టెయిలెండర్‌ మొహమ్మద్‌ సైఫుద్దీన్‌ అజేయమైన 35 పరుగులతో రాణించడంతో బంగ్లాదేశ్‌ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. 

బంగ్లా ఇన్నింగ్స్‌లో సైఫుద్దీన్‌తో పాటు మొహమ్మద్‌ నైమ్‌ (10), మెహిది హసన్‌ మిరాజ్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో సల్మాన్‌ మీర్జా 3, ఫహీమ్‌ అష్రాఫ్‌, మొహమ్మద్‌ నవాజ్‌ చెరో 2, అహ్మద్‌ దెనియాల​్‌, సల్మాన్‌ అఘా, హుసేన్‌ తలాట్‌ తలో వికెట్‌ తీశారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)