Breaking News

మ్యాచ్‌కు ఆటంకం కలిగించిన అభిమాని.. క్రికెటర్‌ చర్య వైరల్‌

Published on Sat, 06/11/2022 - 18:15

పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక సంఘటన ఆసక్తి కలిగించింది. మ్యాచ్‌ జరుగుతుండగానే ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఈ చర్యతో ఆటగాళ్లు సహా అంపైర్లు షాక్‌కు గురయ్యారు. అయితే సదరు వ్యక్తి ఎవరికి హాని కలిగించకుండా నేరుగా స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న పాక్‌ బ్యాటర్‌ షాదాబ్‌ ఖాన్‌ వద్దకు వచ్చాడు. మొదట ఆశ్చర్యంగా చూసినప్పటికి.. ఆ తర్వాత తన వద్దకు వచ్చిన అభిమానిని సంతోషంగా హగ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సంతోషంగా నవ్వుకుంటూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. కాగా షాదాబ్‌ ఖాన్‌ తన చర్యతో మిగతా క్రికెట్‌ ఫ్యాన్స్‌ మనసులు గెలుచుకున్నాడు. ఇన్నింగ్స్‌ 39వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది.

ఇక రెండో వన్డేలో పాకిస్తాన్‌ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్‌ కైవసం చేసుకుంది. పాక్‌ విజయంలో ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం,మహ్మద్ నవాజ్‌ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటిం‍గ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 155 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో షమర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. 

చదవండి: Babar Azam: విండీస్‌తో మ్యాచ్‌ పాకిస్తాన్‌ కెప్టెన్‌ ‘ఇల్లీగల్‌ ఫీల్డింగ్‌’.. అందుకు మూల్యంగా..

పాక్‌ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్‌

Videos

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

Photos

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)