Breaking News

పాక్‌ క్రికెట్‌లో ముసలం.. బాబర్‌తో విభేదాలు! వైస్‌ కెప్టెన్‌పై వేటు

Published on Tue, 09/19/2023 - 08:11

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంతో జట్టులోని మిగితా ఆటగాళ్లకు విభేధాలు తలెత్తున్నట్లు సమాచారం. ఆసియాకప్‌-2023 లీగ్‌ దశలో అదరగొట్టిన పాకిస్తాన్‌.. సూపర్‌-4లో ఓటమి పాలై టోర్నీ అనుహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ టోర్నీ అంతటా కెప్టెన్‌గా బాబర్‌ ఆజం తీసుకున్న నిర్ణయాలపై కొంతమంది ఆటగాళ్ళు ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు వినికిడి. 

అదేవిధంగా పాకిస్తాన్‌ డ్రెసింగ్‌ రూమ్‌లో రెండు వర్గాలు ఉన్నాయని, కొంతమంది ఆటగాళ్ళు బాబర్ ఆజం నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్ ఆజం, స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

స్టార్‌ బ్యాటర్‌ మహమ్మద్ రిజ్వాన్ కూడా బాబర్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా బాబర్‌ ఆజంపై పాక్‌ వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ కూడా కీలక వాఖ్యలు చేశాడు. "ఫీల్డ్‌లో బాబర్‌ ఆజంతో అంత ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే అతడు మైదానంలో పూర్తి భిన్నంగా ఉంటాడు. కానీ ఆఫ్‌ది ఫీల్డ్‌ మాత్రం అతడితో మేము మంచిగా ఎంజాయ్‌ చేస్తామని షాదాబ్‌ పేర్కొన్నాడు. 

షాదాబ్‌ ఖాన్‌పై వేటు..
కాగా బాబర్‌పై షాదాబ్‌ బహిరంగంగా చేసిన వాఖ్యలను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సీరియస్‌గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైస్‌ కెప్టెన్సీ పదవి నుంచి షాదాబ్‌ను తప్పించాలని పీసీబీ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న పీసీబీ బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియోన్యూస్ తమ రిపోర్టులో వెల్లడించింది.
చదవండి: Asia Cup 2023: 'అతడు ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌.. చాలా గర్వంగా ఉంది'

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)