Breaking News

అదో గల్లీ జట్టు.. భారత్‌-పాక్‌ హోరాహోరీ సమరాలు ఇక చరిత్రే..!

Published on Sun, 09/21/2025 - 17:51

ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 21) జరుగబోయే సూపర్ 4 మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ జట్టుపై భారత మాజీ సెలెక్టర్‌, వరల్డ్‌కప్‌ విన్నిర్‌ (1983) కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జట్టు చెన్నై లోకల్ లీగ్‌లో 7వ డివిజన్ జట్టులా ఉందని అన్నారు.

ఇలాంటి బలహీనమైన జట్టుతో ఆసియా కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పాల్గొనడం పాకిస్తాన్‌ చేసుకున్న అదృష్టమని తెలిపారు. ఈ జట్టుకు టీమిండియాతో ఆడే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. పాక్‌ జట్టును అసోసియేట్ దేశాల జట్లతోనే ఆడించాలని సూచించారు.

ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌లు ఇకపై జనాన్ని ఆకర్షించవని అన్నారు. భారత్‌-పాక్‌ హోరీహోరీ సమరాలు చరిత్రే అని అభిప్రాయపడ్డారు. హెస్సన్‌ లాంటి కోచ్‌ వల్ల కూడా పాక్‌కు ఒరిగేదేమీ లేదని తెలిపారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించారు.

శ్రీకాంత్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే సానుకూలంగా స్పందిస్తున్నారు. నిజంగానే తమ జట్టు గల్లీ జట్ల కంటే హీనంగా ఉందని అంటున్నారు. తమ దేశ క్రికెట్‌ చరిత్రలో ఇంత దారుణమైన జట్టును చూడలేదని చర్చించుకుంటున్నారు.

కాగా, ప్రస్తుత ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ చచ్చి చెడి సూపర్‌ 4కు అర్హత సాధించింది. గ్రూప్‌ దశలో ఒమన్‌పై ఘనంగా గెలిచినా.. టీమిండియా చేతిలో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. సూపర్‌ 4కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూఏఈ చేతిలో భంగపాటును తృటిలో తప్పించుకుంది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)