Breaking News

న్యూజిలాండ్‌ బ్యాటర్‌ భారీ విన్యాసం.. వైరల్‌ వీడియో

Published on Sun, 04/28/2024 - 13:07

పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మధ్య నిన్న (ఏప్రిల్‌ 27) జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ బ్యాటర్ టిమ్‌ సిఫర్ట్‌ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడేందుకు భారీ విన్యాసం చేశాడు. మొహమ్మద్‌ ఆమిర్‌ బౌలింగ్‌లో వైడ్‌గా వెళ్తున్న బంతిని ఆడేందుకు సీఫర్ట్‌ భారీ డైవ్‌ కొట్టాడు. 

సహజంగా ఇలాంటి విన్యాసాలను ఫీల్డింగ్‌ చేసేప్పుడు చూస్తాం. కానీ సీఫర్ట్‌ మాత్రం బ్యాటింగ్‌లో డైవింగ్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేసి హైలైటయ్యాడు. సీఫర్ట్‌ డైవిండ్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

 

 మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్‌ న్యూజిలాండ్‌ను 9 పరుగుల తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (69) అర్దసెంచరీతో రాణించగా.. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో డైవింగ్‌ షాట్‌ హీరో సీఫర్ట్‌ (52) మెరుపు అర్దశతకంతో ఆకట్టుకున్నాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో సీఫర్ట్‌ మినహా ఎవరూ రాణించకపోవడంతో పర్యాటక జట్టుకు ఓటమి తప్పలేదు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్‌.. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌.. నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పాక్‌ గెలుపొందాయి. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)