పట్టు బిగించిన కివీస్‌.. మరో పరాభవం దిశగా పాక్‌

Published on Fri, 01/06/2023 - 07:13

కరాచీ: పాకిస్తాన్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ విజయంపై న్యూజిలాండ్‌ గురి పెట్టింది. మూడున్నర రోజుల పాటు చప్పగా సాగిన రెండో టెస్టు గురువారం చివర్లో ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. 319 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన పాక్‌ ఆట ముగిసే సమయానికి 2.5 ఓవర్లలో ఒక్క పరుగు కూడా చేయకుండా 2 వికెట్లు కోల్పోయింది.

అబ్దుల్లా షఫీక్‌ (0), నైట్‌వాచ్‌మన్‌ మీర్‌ హమ్జా (0) బౌల్డ్‌ కాగా, ఇమామ్‌ ఉల్‌ హక్‌ (0 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నాడు. బంతి ఇప్పటికే అనూహ్యంగా స్పందిస్తుండగా చివరి రోజు పాక్‌ విజయాన్ని అందుకోవడం అంత సులువు కాదు! అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటై పాక్‌ 41 పరుగుల ఆధిక్యం కోల్పోగా, రెండో ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్‌ 5 వికెట్లకు 277 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. బ్రేస్‌వెల్‌ (74 నాటౌట్‌), బ్లన్‌డెల్‌ (74), లాథమ్‌ (62) అర్ధ సెంచరీలు చేశారు.  

కాగా, ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను పాకిస్తాన్‌ 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఒకవేళ న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లోనూ పాక్‌ ఓటమిపాలైతే స్వదేశంలో పాక్‌కు ఇది వరుసగా రెండో పరాభవం అవుతుంది. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)