Breaking News

ఒక్క మాటతో రమీజ్‌ రాజా నోరు మూయించిన బాబర్‌! ప్రతి వాడూ..

Published on Wed, 12/21/2022 - 11:23

Pakistan vs England, 3rd Test- Babar Azam: ‘‘ప్రతీ ఫార్మాట్‌ కోసం ఒక కచ్చితమైన ప్రణాళిక ఉంటుంది. తమ వ్యూహాలకు అనుగుణంగా ఎవరైనా ఎలాగైనా ఆడవచ్చు. అయితే, ఒక్కరోజు లేదంటే ఒక్క వారంలో మార్పు సాధ్యం కాదు. ఆటతీరు మార్చుకోవడానికి, ఆటగాళ్ల మైండ్‌సైట్‌ మారాలంటే కాస్త సమయం పడుతుంది.

అంతేగానీ వెంట వెంటనే ఏదీ జరిగిపోదు. ఒకవేళ మేము డిఫెన్స్‌ ఆడితే.. దూకుడుగా ఎందుకు ఆడటం లేదని ప్రశ్నిస్తారు. అదే దూకుడుగా ఆడితే.. ఇంకోలా ఆడొచ్చు కదా అంటారు. మనం ఎలా ఆడినా ఇలాంటి పెదవి విరుపులు, ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందరికి సంతృప్తి కలిగేలా ఆడటం ఎవరికీ సాధ్యం కాదు’’ అంటూ పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అన్నాడు.

ఇం‍గ్లండ్‌లా ‘బజ్‌బాల్‌’ విధానాన్ని అవలంబించాలన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ రమీజ్‌ రాజాకు పరక్షంగా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. కాగా కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ మార్గదర్శనం, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ నేతృత్వంలో ఇంగ్లండ్‌ టెస్టుల్లోనూ దూకుడైన ఆట తీరు కనబరుస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వీరిద్దరు తమ తమ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లండ్‌ ఆడిన 10 టెస్టుల్లో తొమ్మిదింట విజయం సాధించడంతో.. బజ్‌బాల్‌ విధానంపై క్రీడా ప్రపంచంలో చర్చ నడుస్తోంది.

బాబర్‌కు చెప్పాను..
ఈ నేపథ్యంలో పర్యాటక ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్రై క్రికెట్‌ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌ మాదిరిగానే.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడాలని బాబర్‌కు సూచించాను.

ఇందుకోసం జట్టులో ఎక్కువ మంది టీ20 ప్లేయర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పాను. పాకిస్తాన్‌ ఇలాంటి ఆటతీరు కచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే. భవిష్యత్‌ తరం ఇంగ్లండ్‌ మాదిరిగానే సంప్రదాయ క్రికెట్‌లోనూ టీ20ల మాదిరి ఆడాలని బలంగా కోరుకుంటున్నా’’ అని రమీజ్‌ రాజా పేర్కొన్నాడు.

మ్యాచ్‌ ఓడితే ఇంతే!
ఈ విషయం గురించి మూడో టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన బాబర్‌ ఆజంకు ప్రశ్న ఎదురైంది. ఈ నేపథ్యంలో పాక్‌ సారథి ఈ మేరకు పైవిధంగా స్పందించాడు. మ్యాచ్‌ ఫలితాన్ని బట్టే ఎదుటి వాళ్ల ప్రవర్తన ఉంటుందన్న బాబర్‌... ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే విమర్శలు వినిపిస్తాయి అని పేర్కొన్నాడు.

ప్రతి ఫార్మాట్‌కు ఒక విధానమంటూ ఉంటుందని.. ఒక్కరోజులోనే మార్పు సాధ్యం కాదంటూ రమీజ్‌ రాజాకు చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల మ్యాచ్‌లో పాక్‌ వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. దీంతో బాబర్‌ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చదవండి: Ben Stokes: పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్‌.. అరుదైన జాబితాలో చోటు
Lionel Messi: వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్‌ ఫోటో

Videos

సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)