Breaking News

ఘన విజయం; లంక గడ్డపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా

Published on Thu, 07/20/2023 - 11:36

శ్రీలంక పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్‌ జట్టు శుభారంభం చేసింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పాకిస్తాన్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. లంక విధించిన 131 పరుగుల టార్గెట్‌ను పాకిస్తాన్‌ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇమాముల్‌ హక్‌(50 పరుగులు నాటౌట్‌) చివరి వరకు నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

మూడు వికెట్లకు 48 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.24 పరుగులు చేసిన బాబర్‌ ఆజం ప్రభాత్‌ జయసూరియా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌ హీరో సాద్‌ షకీల్‌ 38 బంతుల్లో 30 పరుగులతో నిలకడగా ఆడి పాక్‌ను విజయం దిశగా నడిపించాడు. అయితే స్వల్ప వ్యవధిలో షకీల్‌తో పాటు కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఔటయ్యారు. వీర్దిదరు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అగా సల్మాన్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలిచి పాక్‌కు విజయాన్ని అందించాడు.

లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూరియా నాలుగు వికెట్లు తీయగా.. రమేశ్‌ మెండిస్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌట్‌ అయింది. ధనుంజయ డిసిల్వా సెంచరీతో మెరిశాడు. ఇక పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌట్‌ అయింది. సాద్‌ షకీల్‌ డబుల్‌ సెంచరీ(208 పరుగులు నాటౌట్‌)తో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో లంక 279 పరుగులకే చాప చుట్టేసింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూలై 24 నుంచి 28 వరకు కొలంబో వేదికగా జరగనుంది.

లంక గడ్డపై టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా పాకిస్తాన్‌ నిలిచింది. ఇప్పటివరకు పాక్‌ లంకలో 26 టెస్టులాడి 10 విజయాలు అందుకొని తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఇంగ్లండ్‌ జట్టు(18 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు), భారత్‌(24 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో) మూడో స్థానంలో ఉంది.

చదవండి: Ashes 2023: 'అనుకున్నంత గొప్ప క్యాచ్‌ ఏమి కాదులే..

Virat Kohli: '500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్‌ కొట్టాల్సిందే'

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)